ఒక అడవి కి రారాజుగా ఉన్న భీకర సింహాన్ని ప్రత్యర్థులు, గుంట నక్కలు తట్టుకో లేక పోయాయి. వారి కుటుంబం లో చిచ్చు పెట్టి .. దాన్ని గోబెల్స్ ప్రచారంతో తప్పించి దాని వారసుడికి బాధ్యతలు తీసుకునేలా చేశాయి. ఆ తర్వాత తమ తెలివితో చిన్నవాడైన ఆ రారాజు కుమారుడిని ఇరకాటంలో పడేసి దెబ్బతీసి పక్కకు తప్పించాయి. అలా అడవి మొత్తం ప్రత్యర్థుల పరమైంది. ఇదో సినిమా కథ. ఇదే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీపై జరుగుతోందని టీఆర్ఎస్ లో ప్రచారంలోకి వచ్చిన ఒక చర్చ..
‘కేటీఆర్ సీఎం’ అన్న ప్రచారం జరగడానికి ప్రధానంగా ఒక బలమైన మీడియా, ఒక పార్టీ కారణంగా టీఆర్ఎస్ ముఖ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారట.. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణే కాదు.. దేశంలోనే రాజకీయ వ్యూహచతురతల్లో తలపండిన మేధావి. ఆయనను ఢీ కొనలేక చంద్రబాబు అమరావతి పారి పోయాడన్న చర్చ సాగింది. ఇక కేసీఆర్ పథకాలనే మోడీ కాపీ కొట్టేశారు. అందుకే కేసీఆర్ ఉన్నంత కాలం.. తెలంగాణ లో అధికారం, పట్టు దక్కవని ఒక వర్గం మీడియా ఓ జాతీయ పార్టీ కలిసి ఈ ‘కేటీఆర్ సీఎం’ అన్న ప్రచారం తెరపైకి తెచ్చాయని గులాబీ పార్టీలో తీవ్ర చర్చ జరిగిందట..
కేసీఆర్ ను ఢీ కొట్టలేని ఆ జాతీయ పార్టీ, బలమైన మీడియా కేసీఆర్ కుటుంబం లో చిచ్చు పెట్టి కేటీఆర్ ను సీఎం చేసేలా చేసి ఆ తర్వాత గులాబీ పార్టీని అస్థిరపరిచి.. తెలంగాణలో పాలనను చేజిక్కించుకునే ప్లాన్ చేసినట్టు కుట్ర పన్నారని.. టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరిగినట్టు తెలిసింది..
అయితే ఇదే విషయం పై కేసీఆర్ తన కుమారుడైన కేటీఆర్ కు విడమరిచి చెప్పారట.. ‘‘కేటీఆర్ సీఎం అంటూ నీ పై ప్రేమతో ఆ మీడియా రాయడం లేదని.. నన్ను పక్కకు తప్పించి నీకు బాధ్యతలు ఇచ్చి ఈ తెలంగాణ ను కుక్కలు చింపిన విస్తరి చేయడానికి ప్లాన్ చేశారని’’ హితబోధ చేశారట.. దీంతో తేరుకున్న కేటీఆర్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘కేసీఆరే సీఎం’ అంటూ ప్రకటించారు.
ఇలా జాతీయ పార్టీ, ఓ బలమైన మీడియా కేటీఆర్ ను సీఎం చేయాలని పన్నిన కుట్రను కేసీఆర్ తెలివిగా తప్పించాడని అంటున్నారు. ఈ విషయం లో తొందర పడిన కేటీఆర్ కు విషయం అర్థమైందని ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇదంతా తెరవెనుక జరిగిన విషయం కాబట్టి బయటపడలేదు. ఆఫ్ ది రికార్డ్ గానే ఈ చర్చ టీఆర్ఎస్ ఉన్నత స్థాయి వర్గాల్లో సాగుతోందట..