జగన్ ది వ్యూహాత్మక నిర్ణయమేనా ?

Update: 2021-09-26 05:30 GMT
తాజాగా ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా పరిషత్ ఛైర్మన్, ఛైర్ పర్సన్ల విషయంలో కూడా జగన్మోహ న్ రెడ్డి బీసీ సామాజికవర్గాలకు పెద్ద పీట వేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటినుండే పదవుల పంపకంలో సామాజికవర్గాల సమతూకానికి పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ అదే సూత్రాన్ని కంటిన్యు చేస్తున్నారు. తాజాగా ఎంపికైన జడ్పీ ఛైర్మన్లు, ఛైర్ పర్సన్లలో బీసీలకే పెద్దపీట వేశారు.

మొత్తం 13 మందిలో ఆరుజిల్లాల్లో ఛైర్మన్లు, ఛైర్ పర్సన్లుగా బీసీలనే ఎంపికచేశారు. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే చిత్తూరు, విజయనగరం జిల్లా పరిషత్ ను ఓసీ జనరల్ కు కేటాయించారు. అయితే ఈ రెండు జిల్లా పరిషత్ ఛైర్మన్లను కూడా బీసీ నేతలతోనే బర్తీచేశారు. మామూలుగా ఏ సామాజికవర్గానికి రిజర్వు చేసిన స్ధానాలను ఆయా సామాజికవర్గాల నేతలతోనే బర్తీ చేయటం తెలిసిందే. కానీ అగ్రవర్ణాలకు కేటాయించిన స్ధానాలను కూడా బీసీలకు కేటాయించటం గమనించాలి.

రాష్ట్రంలో బీసీల జనాభా దామాషా ప్రకారం ఓట్లలో కూడా బీసీలే ఎక్కువగా ఉన్నారు. అందుకనే జగన్ మొదటినుండి బీసీలపైనే గట్టి దృష్టిపెట్టారు. ఇపుడు 13 జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఛైర్ పర్సన్ల ఎంపికలో కూడా అత్యధికం బీసీలకు కేటాయించటంలో జగన్ రాజకీయ వ్యూహం దాగుందని అందరికీ తెలిసిందే. బీసీల మద్దుతు లేనిదే రాజకీయ అధికారం సాధ్యంకాదని అందరికీ తెలిసిందే. మొదటినుండి బీసీల్లో అత్యధికులు టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు.

మొదటిసారిగా 2019 ఎన్నికల్లోనే టీడీపీకి మద్దతిచ్చే విషయంలో  బీసీల్లో చీలికొచ్చింది. ఇలాంటి అనేక కారణాల వల్ల వైసీపీ అఖండ మెజారిటి సాధించింది. దాంతో జగన్ బీసీలకు పెద్దపీట వేయటం ద్వారా టీడీపీ భవిష్యత్తును  పూర్తిగా నేటమట్టం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే పదవుల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్ వ్యూహం ఫలిస్తోందని చెప్పటానికి స్ధానికసంస్ధల్లో వచ్చిన ఫలితాలే ఉదాహరణగా చెప్పాలి.

ఇదే ఒరవడి భవిష్యత్తులో కూడా జగన్ కంటిన్యు చేయబోతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఎప్పుడూ జనరల్ స్ధానాల్లో బీసీ నేతలను ఎంపికచేసింది లేదు. కానీ ఇపుడు జగన్ మాత్రం సహజంగా జరిగే సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే జనాలు కూడా వైసీపీకి ఇంత సానుకూలంగా స్పందిస్తున్నారు. బీసీలు అత్యధికంగా ఉండే జిల్లాలు లేదా నియోజకవర్గాలపైనే జగన్ ఎక్కువగా దృష్టిపెట్టారు. అందుకనే బీసీలకు ఇంతగా పెద్దపీట వేస్తున్నది.
Tags:    

Similar News