• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాద‌యాత్ర స‌రే.. టార్గెట్...

పాద‌యాత్ర స‌రే.. టార్గెట్ రీచ్ కావ‌డ‌మే క‌ష్టమా... లోకేష్ ఏం చేస్తారు..?

By - Tupaki Desk
Update: 2022-11-16 04:02 GMT
జ‌న‌వ‌రి 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్ణ‌యించుకున్నారు. ఆ రోజు ఆయ‌న మాతృమూర్తి భువ‌నేశ్వ‌రి వీర తిల‌కం దిద్ది నారా లోకేష్‌ను క‌ద‌న రంగంలోకి దింప‌నున్నారు. అటు నుంచి ఆయ‌న ఏకంగా 400 రోజుల పాటు పాద‌యాత్ర నిర్వ‌హిస్తారు. అయితే.. దీని వెనుక నారా లోకేష్ కానీ, పార్టీ నేత‌లు కానీ పెట్టుకున్న‌ల‌క్ష్యం ఏంటి?  అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు సుదీర్ఘ పాద‌యాత్ర  చేసిన రికార్డు జ‌గ‌న్‌కు ఉంది. దీనిని తుడిపేసేయాల‌నేది ఒక ల‌క్ష్యం. రెండు.. జ‌గ‌న్ మాదిరిగా అధికారంలోకి వ‌చ్చేయాల‌నేది.

అయితే, ఇవి సాధ్య‌మేనా అంటే, మొద‌టి ల‌క్ష్యం సాధ్యం.. సాకారం కావొచ్చు. ఎందుకంటే జ‌గ‌న్ 341 రోజుల న‌డిచి.. మ‌ధ్య‌లో విరామం ఇచ్చారు కూడా! ఏకంగా 3,648 కిలో మీట‌ర్లు ముందుకు సాగారు. ఇక‌, ఇప్పుడు దీనికి ప్ర‌తిగా నారా లోకేష్‌.. ఏకంగా 400 రోజులు న‌డ‌వ‌నున్నారు. జిల్లాల‌కు జిల్లాల‌ను ఆయ న చుట్టేయ‌నున్నారు. అదేస‌మ‌యంలో విరామ‌మెరుగ‌ని బాట‌సారిగా కూడా రికార్డు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇవ‌న్నీ సాధ్య‌మే. అయితే, అధికారంలోకి రావ‌డం.. జ‌గ‌న్ తెచ్చుకున్న‌న్ని(151) సీట్లు తెచ్చుకోవ‌డం వంటి కీల‌క విష‌యాల్లో లోకేష్ వ్యూహం ఏంటి? అనేది ప్ర‌శ్న‌.

జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి అధికారంలోకి వ‌చ్చారు కాబ‌ట్టి నేను కూడా పాద‌యాత్ర చేసి అధికారంలోకి వ‌చ్చేస్తాను.. అనే విధంగా లోకేష్ ఆలోచ‌న చేస్తే.. ఇబ్బంది త‌ప్ప‌దు. ఎందుకంటే.. పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు అక్క‌డిక‌క్క‌డే అనేక హామీలు గుప్పించారు. మ‌రి ఈ త‌ర‌హా హామీలు ఇవ్వ‌డంలో లోకేష్ పాత్ర ఏంటి?  అదేవిధంగా టికెట్ల‌ను కూడా జ‌గ‌న్ అప్ప‌ట్లో నే ప్ర‌క‌టించారు. క‌ర్నూలులో కంగాటి శ్రీదేవి, గుంటూరు చిల‌క‌లూరి పేట‌లో విడ‌ద‌ల ర‌జ‌నీ వంటివారికి పాద‌యాత్ర స‌మ‌యంలోనే టికెట్ల హామీ ఇచ్చారు.

మ‌రి ఇవ‌న్నీ లోకేష్ చేయ‌గ‌ల‌రా? ఆయ‌న‌కు అస‌లు ఆ అధికారం ఉందా?  ఎందుకంటే పార్టీ అధినేత చంద్ర‌బాబు. సో.. ఏదైనా ఆయ‌నే నిర్ణ‌యం తీసుకోవాలి. సో.. ఈ ప‌రిస్థితిని లోకేష్ ప్రాథ‌మికంగా అధిగ‌మిస్తేనే నాయ‌కుల్లో బ‌లం పెరుగుతుంది, లోకేష్ ప‌ట్ల గౌర‌వం పెరుగుతుంది. ఇక‌, మ‌రోకీల‌క విష‌యం ఎక్క‌డ‌క‌క్క‌డ త‌మ్ముళ్ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు జోరుగా సాగుతోంది. దీనిని స‌రిదిద్ద‌డం చంద్ర‌బాబుకే సాధ్యం కావ‌డం లేద‌నే వాద‌న ఉంది. ఇప్పుడు లోకేష్ రంగంలోకి దిగిన త‌ర్వాత దీనిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారు అనేది కూడా ఆస‌క్తిగా మారింది.

ఇవ‌న్నీ ఇలా ఉంటే, వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును సానుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తారా?  లేక టీడీపీ సొంత ఓటు బ్యాంకును బ‌లోపేతం చేస్తారా?  అనేది కూడా సందేహ‌మే. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకుపైనే ఆధార‌ప‌డి పాద‌యాత్ర చేస్తే.. దానివ‌ల్ల కొంత మేర‌కే ఫ‌లితం వుంటుంది. అలా కాకుండా పార్టీని బ‌లోపేతం చేయ‌డం అత్యంత కీల‌కం. ఇక్క‌డే లోకేష్‌ను వ్య‌తిరేకించే సీనియ‌ర్ నేత‌ల వ‌ర్గాన్ని ఆయ‌న త‌న‌వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అదేస‌మ‌యంలో వైసీపీ నుంచి వ‌చ్చే క‌వ్వింపులు.. ప‌దునైన విమ‌ర్శ‌లు.. పాద‌యాత్ర‌పై అవ‌హేళ‌న‌లు.. ఇలా అనేక సంకెళ్ల‌ను ఎదుర్కొంటే త‌ప్ప‌.. లోకేష్ టార్గెట్ అయితే పూర్తికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • AndhraPradesh 
  • YSRCP 
  • JaganMohanReddy 
  • TeluguDeshamParty 
  • NaraLokesh 
  • Padayatra 
  • Majority 
  • Power 
  • Target 
  • LatestNews 
  • Politics 
  • PoliticalNews 
  • TupakiNews 

Similar News

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!

2026-11-21 09:52 GMT

రాప్తాడు బాలికకు భారీ ఆర్థిక సాయం.. చికిత్సకు అయ్యే రూ.32 లక్షలు చెల్లింపు

2026-11-21 08:38 GMT

కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

2026-11-21 08:35 GMT

కన్నీటి కడలిలో ఆశాకిరణం.. రూ.9 కోట్ల ప్రాణరక్షక మందును రూ.2.5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు

2026-11-21 07:30 GMT

బంగారంలో రీనియం కలిపేసి మోసం.. ఏ మెషీన్ కు, మనుషులకు చిక్కని దొంగ బంగారం స్కామ్

2026-11-21 06:33 GMT

ట్రంప్ కొత్త 'డేటా' దేశభక్తి పాఠం.. వినకపోతే ఖతమేనట..

2026-11-21 06:31 GMT

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

మంటల బొమ్మలు చూసి నీళ్లు చిమ్మిన ఫైర్ సిస్టమ్.. ఫుడ్ స్టాల్‌లో వింత ఘటన!

2026-11-21 04:24 GMT

జెన్సన్ హువాంగ్ కొత్త కంపెనీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడి? వైరల్ వార్త వెనుక అసలు విషయం!

2026-11-21 04:24 GMT

ఆంథ్రోపిక్ ఉద్యోగులకు భారీ లాభం.. ఒక్క ఐపీఓతో కోట్లలోకి షేర్ల విలువ!

2026-11-21 04:23 GMT

Copyright @2026

Powered by Blink CMS