తైవాన్ ఆక్రమణకు చైనా ప్లాన్ చేస్తోందా ?

Update: 2022-05-24 06:30 GMT
ప్రపంచదేశాలన్నీ ఉక్రెయిన్-రష్యా యుద్ధపై దృష్టి పెట్టిన సమయంలోనే డ్రాగన్ దృష్టి మాత్రం తైవాన్ పై పెట్టిందట. పొరుగునే ఉన్న తైవాన్ ను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ దేశం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎప్పటినుండో తైవాన్ ఆక్రమణపై డ్రాగన్ దేశం కన్నేసింది. అయితే ఎప్పటికప్పుడు అగ్రరాజ్యం అమెరికా, మిత్రదేశాలు అడ్డుకుంటుండటంతో ఆక్రమణను చైనా వాయిదా వేస్తోంది.

ఆ మధ్య తైవాన్ గగనతలంపై చైనా యుద్ధ విమానాలు అక్రమంగా ప్రవేశించటం సంచలనంగా మారింది. ఎప్పుడైతే తైవాన్ కు చైనా నుండి కబ్జా ప్రమాదముందని అర్ధమైందో వెంటనే అమెరికా, మిత్రదేశాలు కొంత సైన్యాన్ని ప్రధానంగా నావికాదళాన్ని తైవాన్లో మకాం వేయించాయి. దాంతో చైనా మళ్ళీ గగనతలంపైకి తన విమానాలను పంపలేదు. అయితే తాజాగా ప్రపంచ దేశాల దృష్టి ఉక్రెయిన్-రష్యా మీదున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదే అదునుగా చైనా తైవాన్ పై తన దృష్టిని పెట్టిందట. ఈ మధ్యనే తైవాన్ కేంద్రంగా తన సైనిక విన్యాసాలను ప్రదర్శించింది.  తైవాన్ కు మద్దతుగా అమెరికా, జపాన్ దేశాల సైన్యాలున్నాయి.

జపాన్ కు మాత్రమే ప్రత్యేకమైన జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ (అవాక్స్) ని పోలివుండే నిర్మాణాన్ని చైనా రెడీ చేయటమే సంచలనంగా మారింది. జపాన్ కు చెందిన అవకాస్ అత్యంత పవర్ ఫుల్ వైమానికదళం. ఇలాంటి పవర్ ఫుల్ విమానాలు జపాన్ దగ్గర నాలుగున్నాయి.

అచ్చంగా ఇలాంటి విమానాలను చైనా కూడా తయారుచేస్తోంది. జపాన్ దగ్గర ఉన్న ఈ నాలుగు విమానాలను దెబ్బ తీయగలిగితే తైవాన్ పై జపాన్ నిఘా వేయటంలో ఇబ్బందులు మొదలవుతాయి.

ఇదే అదునుగా తైవాన్ పై మెరుపుదాడులు చేసి కబ్జాచేయాలని చైనా ప్లాన్ చేస్తున్నట్లు జపాన్ నిఘావర్గాలు బయటపెట్టాయి. చైనా చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ జపాన్ శాటిలైట్స్ ద్వారా బయటపడ్డాయి. జపాన్ శాటిలైట్స్ ద్వారా తమ విషయం బయటపడుతుందని చైనాకు తెలిసినా వెనకాడకపోవటమే చైనా తెగింపు నిదర్శనంగా మారింది.
Tags:    

Similar News