రేపే ఏపీ కేబినెట్ విస్తరణ?
మోపిదేవి - పిల్లి సుభాష్ లు రాజ్యసభ ఎంపీలుగా పోవడంతో ఖాళీ అయిన రెండు మంత్రిపదవులను భర్తీ చేసేందుకు సీఎం జగన్ ఏపీ కేబినెట్ విస్తరణ చేయబోతున్నాడనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. అయితే జూలై 22న బుధవారం రేపే మధ్యాహ్నం 1.29 నిమిషాలకు ఇద్దరు కొత్త మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయబోతున్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముహూర్తాన్ని ఖరారు చేశారని.. రేపు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారని వార్తలు వస్తున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన రాంచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పేర్లు దాదాపు మంత్రులుగా ఖరారైనట్టు సమాచారం.
అయితే కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారంపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఈ సాయంత్రం లోపు మీడియాకు సమాచారం ఇస్తారని ప్రచారం సాగుతోంది.
ఇద్దరు బలహీన సామాజికవర్గాలకే జగన్ మంత్రి పదవులు ఇవ్వబోతున్నారనే ప్రచారం వైసీపీలో సాగుతోంది. మరి దీనిపై తొందరలోనే క్లారిటీ రానుంది.