వైసీపీలోకి బొబ్బిలి రాజులు.. అశోక్‌కు చెక్ పెట్టేందుకేనా?
టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ సర్కారు మరో వ్యూహంతో ముందుకు సాగుతోందా? విజయనగరం జిల్లాలో టీడీపీ ఆధిపత్యానికి, ముఖ్యంగా అశోక్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే.. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ట్రస్టుల విషయంలో ఏడాదిన్నర కిందట .. రాత్రికి రాత్రి.. ఆయనను తప్పించిన వైసీపీ సర్కారు ఇదే కుటుంబానికి చెందిన సంచయితను నియమించడం తెలిసిందే. అయితే.. ఈ విషయంపై కోర్టుకు వెళ్లిన అశోక్.. తనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఒకింత హ్యాపీగానే ఉన్నారు.
అయితే.. ఇప్పుడు మరోసారి వైసీపీ వ్యూహాత్మకంగా అశోక్‌కు చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో గతంలో వైసీపీ తరఫున గెలిచి, తర్వాత 2017లో టీడీపీలోకి వెళ్లి.. మంత్రి పదవిని సొంతం చేసుకున్న బొబ్బిలి రాజులు.. సుజయ్ కృష్ణ రంగారావు.. ఫ్యామిలీని తిరిగి వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం అయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బొబ్బిలి రాజులకు.. విజయనగరం రాజులకు మధ్య విభేదాలు ఉన్నాయి. బొబ్బిలి రాజుల కుటుంబానికి సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబినాయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
విజయనగరం రాజుల వంశానికి అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విభేదాలు.. అనేక రూపాల్లో తిరిగి తిరిగి పాలిటిక్స్ వరకు కూడా చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే సుజయ్.. ముఖ్యంగా రాజకీయాల్లో అశోక్‌ను విభేదిస్తున్నారు. సుజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్‌లో ప్రారంభించగా.. అశోక్ టీడీపీతో ప్రారంభించారు. దీంతో విజయనగరంలో ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో రాజకీయాలు చేసుకున్నాయి. ఇక, ఆ తర్వాత.. సుజయ్.. వైఎస్‌పైనా,. జగన్‌పైనా అభిమానంతో వైసీపీ లో చేరిపోయారు. ఈ క్రమంలోనే 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధింంచారు. అయితే.. విజయనగరంలో కీలక నేతగా ఉన్న.. బొత్స సత్యనారాయణతోనూ రంగారావుకు విభేదాలు ఉన్నాయి.
ఇదిలావుంటే.. 2017లో రంగారావు.. టీడీపీలో చేరిపోయి.. మంత్రి పదవిని పొందారు. ఆ సమయంలో బొత్సతో.. తీవ్రంగా విభేదించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన పోటీ చేసినప్పటికీ.. విజయం దక్కించుకోలేక పోయారు. ఇక, అప్పటి నుంచి కూడా టీడీపీలోనే ఉన్నప్పటికీ.. ఆయన తటస్థ వైఖరితో ఉన్నారు. దీనిని గుర్తించిన వైసీపీ అధిష్టానం.. సుజయ్‌ను తిరిగి తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధానంగా అశోక్‌కు చెక్ పెట్టేందుకేనని అంటున్నారు పరిశీలకులు.
బొబ్బిలి వంశానికి, గజపతుల వంశానికి మద్య ఉన్న సంప్రదాయ విభేదాలను పరిగననలోకి తీసుకున్న వైసీపీ.. టీడీపీని తొక్కేందుకు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న ఈ పార్టీని పక్కకు నెట్టేందుకు ఈ విధానాన్ని అవలంబించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రంగారావు కూడా వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ ప్రధానంగా.. రంగారావు ఎంట్రీకి.. మంత్రి బొత్స సత్యనాఆయణ కుటుంబం అడ్డంకులు సృష్టిస్తోందని అంటున్నారు పరిశీలకులు. రేపు వైసీపీ అధిష్టానం..క నుక బొత్స కుటుంబాన్ని ఈ విషయంలో పక్కన పెట్టగలిగితే.. రంగారావుకు మార్గం సుగమం కానుంది. ఇక, ఆతర్వాత.. ఏం జరుగుతుందో చూడాలి.