బీసీ కార్పొరేషన్స్ వైసీపీ వాళ్లకు కాదా?
అందరికీ వరాలు ఇస్తున్న జగన్ దేవుడు.. వైసీపీనే నమ్ముకొని ఉన్న వాళ్లను మాత్రం కనికరించడం లేదని వాపోతున్నారట.. ఎన్నికల సమయంలో కోరిన వారందరికీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కష్టం కాబట్టి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ పదవులు ఇస్తామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. దీంతో వారంతా జగన్ పై నమ్మకం ఉంచి పార్టీ కోసం పనిచేసి గెలుపునకు దోహదపడ్డారు.
అయితే తెలుగునాట అనాధిగా బీసీల ఓటు బ్యాంకు టీడీపీకే మద్దతుగా ఉంటూ వస్తోంది. బీసీలే టీడీపీ బలం కూడా. జగన్ పాదయాత్రతో హామీలు ఇవ్వడంతో ఆ సామాజిక వర్గాల ఓట్లు 2019 ఎన్నికల్లో వైసీపీకే గంపగుత్తగా పడ్డాయి. దాదాపు 55శాతం బీసీల ఓట్లు జగన్ కు పడ్డాయని తేలిందట..
అయితే జగన్ ఎన్నికల వేళ ప్రతీ ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తామని.. పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. వైసీపీ ఆఫీసుల్లో లిస్ట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ డైరెక్టర్స్ ఎంపిక సమయంలో ఆ లిస్ట్ ను పక్కనపెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే లిస్ట్ ను బట్టి పోస్టులు భర్తీ చేస్తున్నారట.. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను కాదని.. ఎమ్మెల్యేల మాట వినే వాళ్లను.. టీడీపీ నుంచి వైసీపీకి ఎన్నికల తరువాత చేరిన వాళ్లకు.. ఎమ్మెల్యేలు రికమండ్ చేశారని మరికొందరికీ పదవులు పంచుతున్నారట..
ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల లిస్ట్ బయటకు వస్తే పెద్ద దుమారం రేగడం ఖాయం అని వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఒక జిల్లాలోని మంత్రి నియోజకవర్గంలో అన్ని కార్పొరేషన్స్ పదవులు మొత్తం అతడి మనుషులకు ఇచ్చుకున్నాడని మిగతా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
ఏది ఏమైనా పార్టీని నమ్ముకున్న వాళ్లకే ఇస్తే పార్టీ బతికి బట్టకడుతుందని.. లేకపోతే టీడీపీ పరిస్థితి వస్తుందని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.