• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్...

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ

By - Tupaki Desk
Update: 2022-02-15 10:16 GMT
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ అయ్యారు. సవాంగ్ స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని అధికారికంగా నియమించారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

రాజేంద్రనాథ్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా రాజుపాళెం మండలం పర్లపాడు. కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి.

గతంలో కసిరెడ్డి విశాఖపట్నం, విజయవాడ పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగానూ ఆయన సేవలందించారు. మరోవైపు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని గౌతం సవాంగ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేవించింది. కాగా 2023 జులై వరకూ సవాంగ్ పదవీకాలం ఉన్నప్పటికీ ఈలోపే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.

ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం కావడం పోలీసుల వైఫల్యంగానే జగన్ సర్కార్ భావిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకొని తమ బాలాన్ని ప్రదర్శించడం ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు.  పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలివచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వం భావించింది.

ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం.  ఈ బదిలీకి సంబంధించి  అధికారిక ఉత్తర్వులు వెలువడడంతో నిర్ధారణ అయ్యింది.ఈరోజు సీఎం జగన్ ను చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కలిశారు. ఆ తర్వాత డీజీపీ బదిలీ జరిగింది.
Tags:    
  • Andhrapradesh 
  • dgp 
  • gowthamsawang 
  • chalavijayawada 
  • ysrcp 
  • ravindernathreddy 
  • latestews 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS