మా ఆయన కోసమే వెళ్లా.. కౌన్‌ బనేగా కరోడ్‌పతి రూ. కోటి గెలుచుకున్న ఐపీఎస్​ ఆఫీసర్​

Update: 2020-11-19 03:45 GMT
భర్త కలను నెరవేర్చడం కోసం తాను కౌన్​బనేగా కరోడ్​పతి షో కు వెళ్లినట్టు ఆ షో సెకండ్​ విన్నర్​ మోహితా శర్మ తెలిపారు. హిమాచల్​ ప్రదేశ్​ కాంగ్రా కు చెందిన మోహిత ఐపీఎస్​ అధికారి. కౌన్​బనేగా కరోడ్‌పతి సీజన్‌-12లో  సెకండ్​ విన్నర్​గా నిలిచారు. ఆమె ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ‘ ఆ షోలో విజయం సాధించాలని నా భర్త 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయన చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఓ సారి నన్ను ట్రై చేయమని అడిగారు. ఆయన కోరికమేరకు విన్నర్​గా నిలిచాను’ అని మోహితా చెప్పారు.
మోహితాశర్మ భర్త రుషల్‌ గార్గ్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌. వీరిద్దరు ఏడాది కిందటే పెళ్లి చేసుకున్నారు.

‘2019 అక్టోబర్‌లో మేం పెళ్లి చేసుకున్నాం. తర్వాత మాకు వేర్వేరుచోట్ల పోస్టింగ్‌లు వచ్చాయి. ఆయన జమ్మూకశ్మీర్‌లో, నేను మణిపూర్‌లో ఉన్నాం. మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా కలుసుకున్నప్పుడు కేబీసీ చూశాం.  ఇద్దరం సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసినవాళ్లమే. కేబీసీలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మాకు అవగాహన ఉంది. అందుకే ఇద్దరం కలిసి కేబీసీ గెలవడానికి ప్రయత్నించాం. లాక్‌డౌన్‌ కారణంగా కొన్నాళ్లు కలిసున్నాం. తర్వాత నేను మణిపూర్‌ వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడు దేవుడి దయవల్ల నేను కూడా జమ్మూకశ్మీర్‌కు బదిలీ అయ్యాను. ఇద్దరం కలిసి ఉంటున్నాం" అని మోహితా శర్మ తెలిపారు. కోటి రూపాయల బహుమతినిచ్చే ప్రశ్న వచ్చేసరికి పోటీదారులు చాలామంది లైఫ్‌లైన్‌లు వాడుకుంటారు. ఒక లైఫ్‌ లైన్‌ ఉండటమే అరుదు. కానీ మోహితకు రెండు లైఫ్‌లైన్‌లు మిగిలి ఉన్నాయి.

అమితాబ్​ సరదా సంభాషణ

షో లో భాగంగా మోహితాతో కేబీకే హోస్ట్​ అమితాబ్​ బచ్చన్​ మోహితాతో సరదాగా మాట్లాడారు. ‘నా ముందు ఇప్పుడో ఐపీఎస్​ అధికారి కూర్చుని  ఉన్నారు. అయినా నేను భయపడను’ అంటూ ఆయన అన్నారు. మీరు డ్యూటీలో కూడా ఇలాగే సాఫ్ట్​గా ఉంటారా? అని మోహితాను ప్రశ్నించారు. దానికామె డ్యూటీలో చాలా స్ట్రాంగ్​గా ఉంటానని.. పక్కాగా రూల్స్​ అన్ని పాటిస్తానని చెప్పారు. మోహితా ఏ మాత్రం భయపడకుండా అమితాబ్​ ప్రశ్నలకు జవాబు చెప్పారు.
Tags:    

Similar News