అమెరికా రోడ్డుపై ఇండియన్ భార్యభర్తల గొడవ
ఇండియాతో పోల్చితే అమెరికా లో చట్టాలు కఠినంగా ఉంటాయి. భార్య భర్తల మధ్య గొడవను పోలీసులు లైట్ తీసుకుంటారు.;
ఇండియాతో పోల్చితే అమెరికా లో చట్టాలు కఠినంగా ఉంటాయి. భార్య భర్తల మధ్య గొడవను పోలీసులు లైట్ తీసుకుంటారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని కలిసి ఉండేందుకు ఒప్పించి కలుపుతారు. అమెరికాలో మాత్రం పోలీసుల తీరు విభిన్నంగా ఉంటుంది. భార్యపై భర్త దాడి చేసినా, భర్తపై భార్య దాడి చేసినా కేసులు సీరియస్‌గా ఉంటాయి. భార్య భర్తల గొడవలు అక్కడ చాలానే నమోదు అవుతాయి. అయితే కేసు సీరియస్‌నెస్ దృష్ట్యా పూచీకత్తు పెట్టుకుని బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల ఇండియన్ కపుల్ ఏకంగా రోడ్డు పై గొడవ పడటం, భార్యను భర్త చంపేందుకు కారుతో గుద్దేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేసారు . ప్రస్తుతం ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇండియన్స్ పరువు తీసే విధంగా వారు వ్యవహరించారు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో ఇండియన్ కపుల్ గొడవ...
అమెరికాలో జరిగిన ఇండియన్ కపుల్ గొడవ పూర్తి వివరాల్లోకి వెళ్తే... నార్త్ కరోలినాలో నివాసం ఉంటూ రెస్టారెంట్ నిర్వహిస్తున్న పోతియప్పన్ కు గత కొన్నాళ్లుగా భార్యతో విభేదాలు ఉన్నాయి. పిల్లలు ఉన్నప్పటికీ వీరిద్దరూ పదే పదే గొడవ పడుతూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం పోతియప్పన్ పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గృహ హింస కేసు పెట్టి అరెస్ట్ చేయించింది. అరెస్ట్ అయిన పోతియప్పన్‌ను కోర్ట్ 5000 డార్ల పూచికత్తు పెట్టుకుని విడుదల చేయడం జరిగింది. బెయిల్ పై ఉన్న పోతియప్పన్ మరోసారి భార్యపై దాడికి దిగాడు. ఈసారి ఏకంగా రోడ్డుపై ఆమెను పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించాడు. రోడ్డు పై పరిగెడుతున్న ఆమెను కారులో వెంబడించి, ఆమెను గుద్దేందుకు ప్రయత్నించాడు అనేది ఆరోపణ. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన కూతురు ప్రత్యక్ష సాక్ష్యం గా ఉంది.
మతివాసన్ పొతియప్పన్ అరెస్ట్...
49 ఏళ్ల మతివాసన్ పొతియప్పన్ గత కొన్ని రోజులుగా భార్యతో గొడవ పడుతూ, మరో పెళ్లి చేసుకుంటాను అంటూ శారీరక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడట. ఇటీవల ఇద్దరి మధ్య గొడవ ముదిరి దాడి చేసుకునే వరకు వచ్చింది. వెస్ట్ ఫ్రాంక్లిన్ స్ట్రీట్‌లోని చోళనాడ్ ఇండియన్ రెస్టారెంట్ నిర్వహిస్తూ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో పొతియప్పన్ భార్యతో గొడవ కారణంగా మొత్తం వ్యాపారం ను పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది. పదే పదే భర్త దాడి చేశాడు అంటూ ఆమె పోలీసులకు తెలియజేసింది. తాజాగా మరోసారి ఆమెను రోడ్డు పై పరిగెత్తిస్తూ శారీరకంగా హింసించడంతో పొతియప్పన్ పై పోలీసులు మరోసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది.
అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్..
ఈ గొడవల కారణంగా బాగా రద్దీగా ఉండే రెస్టారెంట్ సైతం మూత పడ్డట్లుగా స్థానికులు చెబుతున్నారు. భర్త చేతిలో పదే పదే శారీరక హింసకు గురి అవుతున్న ఆమె కోర్ట్ ముందు తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శారీరకంగా హింసిస్తున్న సమయంలో ఆమె రోడ్డు పై పరిగెత్తడం మొదలు పెట్టిందని, ఆమెను వెంబడిస్తున్న తండ్రిని అడ్డుకునేందుకు పోలీసు హెల్ప్ లైన్ 911 కి వారి కూతురు సమాచారం ఇచ్చిందట. పోలీసులకు సమాచారం ఇవ్వడం మాత్రమే కాకుండా విచారణ సమయంలో కూతురు కోర్ట్‌లో స్వయంగా సాక్ష్యం చెప్పి తన తల్లిని శారీరకంగా వేధించాడు అంటూ తండ్రిని దోషిగా తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంతో ఆ ఇండియన్ ఫ్యామిలీ స్థానిక మీడియాల్లో చర్చనీయాంశం అయ్యారు. అంతే కాకుండా స్థానికంగా ఉన్న ఇండియన్స్ కి సైతం అసహనం కలిగించారు.