ఆన్ లైన్ క్లాసులో ఆగంతకుడి అసభ్యత..

Update: 2021-12-23 10:30 GMT
నేటి ఆధునిక సమాజంలో అంతా మారింది. టెక్నాలజీని మంచికి వాడితే అది అందరికీ ఉపయోగపడుతుంది. చెడుకు వాడితే అది విశృంఖలమవుతుంది.అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే మరికొందరు మాత్రం చెడుదారుల్లో వెళుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పేట్ బషీరాబాద్ కు చెందిన ఓ కార్పొరేట్ స్కూల్ నిర్వాహకులు కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు 7వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు ఆ 7వ తరగతికి సంబంధించిన లింక్ ను డౌన్ లోడ్ చేసుకొని క్లాసులో ప్రత్యక్షమయ్యాడు. అంతేకాకుండా దీనికి సంబంధించిన లింక్ ను కూడా యూట్యూబ్ లో పెట్టాడు.

అయితే ఆ ఆగంతకుడు క్లాస్ నడుస్తున్న సమయంలో టీచర్లు, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో టీచర్లు ఆ ఆగంతకుడికి సంబంధించిన లింక్ ను బ్లాక్ చేశారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

అయితే ఈ వివాదం జరిగిన తర్వాత ఆ టీచర్ సంభాషణలను సదురు వ్యక్తి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. దాంతో బాధిత ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పేట్ బషీరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Full View
Tags:    

Similar News