ఇంటర్నెట్‌ను బాగా వాడేస్తున్నారు ..జర జాగ్రత్త
కరోనా మహమ్మారి పుణ్యమా అని గత సంవత్సరం మొత్తం జనాలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది. చిన్నాపెద్ధాతేడా లేకుండా అందరూ మొబైల్స్, ల్యాప్ టాప్స్ పట్టుకొని బిజీగా మారారు. ఇంటర్నెట్ అతి వినియోగం చాలా ప్రమాదకరమని, ఆరోగ్య సమస్యలతోపాటు అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే, ఒంటరితనాన్ని అనుభవించే కౌమరదశ పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ఒక వ్యసనంగా మారుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. కౌమరదశ పిల్లలు, ముఖ్యంగా పదహారేళ్ల వయసున్నవారు ఇంటర్నెట్ కు బానిసలుగా మారుతున్నారని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నిత్య జీవనంలో డిజిటల్ ను భాగం చేయడమే కాకుండా,మరింత మంది ఆన్ లైన్ కు బానిసలుగా మారేలా కారణమవుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ లైఫ్ లాక్ ఓ నివేదికలో తెలిపింది. కరోనా కారణంగా ఎక్కువ సమయం ఇంటివద్దే ఉండాల్సి రావడంతో ప్రజల ఆన్ లైన్ ధోరణిపై ఈ సంస్థ అంతర్జాతీయంగా అధ్యయనం నిర్వహించింది. భారత్ కు సంబంధించి ఫలితాలను గమనిస్తే.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు కరోనా వల్లే తాము ఆన్ లైన్ కు బానిసలుగా మారినట్టు తెలిపారట. విద్యా, కార్యాలయ పని కాకుండా ఫోన్లు, సిస్టమ్స్ పై తాము వెచ్చించే అదనపు సమయం గణనీయంగా పెరిగినట్టు ప్రతీ 10 మందిలో 8 మంది చెప్పారు.
చదువు, ఆఫీసు పని కాకుండా సగటున ఒక్కొకరు 4.4 గంటలను ఆన్ లైన్ పై గడిపేస్తున్నట్టు ఈ సంస్థ నివేదిక తెలియజేసింది. తాము మరింత సమయం స్మార్ట్ ఫోన్‌పైనే గడిపేస్తున్నామని 84 శాతం మంది తెలిపారు. ఇలా అన్ లైన్ పై ఎక్కువ సమయం గడపడం తమ శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తున్నట్టు 74 శాతం మంది అంగీకరించారు. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోందని 55 శాతం మంది పేర్కొన్నారు. స్నేహితులతో సమయం గడపడం ద్వారా ఫోన్లు, సిస్టమ్స్ పై గడిపే సమయాన్ని పరిమితం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని 76 శాతం మంది చెప్పారు. ఆఫ్‌లైన్‌లో చేసుకోవాల్సిన పనులను కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి పరిస్థితులు కల్పించాయన్నది సుస్పష్టం. అయితే స్క్రీన్లపై గడిపే సమయం, ఇతర పనులకు వెచ్చించే సమయం మధ్య ఆరోగ్యకరమైన సమతూకం అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తిపెట్టుకోవాలి.
ఇక , పిల్లలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. బయట తిరగాలి.. స్నేహితులతో ఆడుకోవాలి.. ముచ్చటించాలి వంటి అనేక కోరికలు ఉంటాయి. కానీ, ఇటీవల కరోనా కాలంలో కాలేజీలు లేకపోవడం. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాల్సి రావడంతో వారిలో ఒంటరితనం విపరీతంగా పెరిగిందట. దాన్ని దూరం చేసుకోవడం కోసం ఇంటర్నెట్ ను అతిగా వాడటం మొదలుపెట్టారని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ పరిశోధకులు వెల్లడించారు. పదహారేళ్ల వయసు పిల్లలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ.. సోషల్‌మీడియా చూస్తూ సమయం గడుపుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. వారిలోని ఒంటరితనమే ఇంటర్నెట్ పై మొగ్గుచూపేలా చేస్తోందని పేర్కొన్నారు. ఇంటర్నెట్ అతివినియోగానికి డిప్రెషన్ కు మధ్య సంబంధం ఉందని పరిశోధకులు వెల్లడించారు