చాక్లెట్ చోరీ చేశాడని డీమార్ట్ సెక్యురిటీ సిబ్బంది కొడితే విద్యార్థి మరణించాడా?
దేశంలోనే అత్యంత విజయవంతమైన రిటైన్ చైన్ మాల్ గా చెప్పే డీమార్ట్ లో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఒకరు అనుమానాస్పద రీతిలో మరణించారు. అతగాడి మరణంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రిచోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ మహానగరంలో డీమార్ట్ షాపులకు కొదవలేదు. ఇదే రీతిలో వనస్థలిపురంలోని డీమార్ట్ సూపర్ మార్కెట్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒక వాదన ప్రకారం డీమార్ట్ కు షాపింగ్ కు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు వెళ్లారు.వీరిలో ఒకరు చాక్లెట్లను తమతో తెచ్చుకున్నట్లుగా ఆరోపిస్తారు. ఆ కుర్రాడిని డీమార్ట్ సెక్యురిటీ సిబ్బంది ఆపారని.. చాక్లెట్లు తీసుకున్న విషయాన్ని గుర్తించి..అతడిపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. అతడ్ని తాము ఆపామే తప్పించి దాడి చేయలేదని సిబ్బంది చెబుతున్నారు. చోరీ చేసిన వైనాన్ని గుర్తించారని.. అతన్ని ఆపారే తప్పించి తాము అతనిపై చేయి చేసుకోలేదని డీమార్ట్ సిబ్బంది చెబుతోంది. మరణించిన కుర్రాడు హయత్ నగర్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు చెబుతున్నారు. అసలు.. డీమార్ట్ కు ఎలాంటి అనుమతులు లేకుండా కాలేజీ నుంచి ఎలా బయటకు పంపుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పై పలు అనుమానాలు వ్యక్తమతుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. డీమార్ట్ సిబ్బంది దాడి చేశారన్నది ఆరోపణే తప్పించి.. అది నిజమని ఇంకా తేల్లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చే వీలుంది.