ఈ చైనా యాప్స్‌తో దేశ భద్రతకు ముప్పు - ఉపయోగించొద్దు!

Update: 2020-06-17 17:30 GMT
45 ఏళ్ల తర్వాత చైనా దుందుడుకు చర్యల వల్ల భారత్-డ్రాగన్ దేశం మధ్య ఘర్షణ చోటు చేసుకొని ఇరవై మంది ఇండియన్ జవాన్లు మృత్యువాత పడ్డారు. చైనాకు కూడా నష్టం పెద్దగానే జరిగిందని అమెరికా ఇంటెలిజెన్స్ సహా వివిధ నివేదికలు చెబుతున్నాయి. అయితే చైనా దీనిపై స్పందించలేదు. చైనా హద్దులు దాటి, ఉద్రిక్తతలు పెంచిపోషిస్తున్న నేపథ్యంలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది.

ఇందులో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ మేడిన్ చైనాకు చెందిన 500 వస్తువులను విడుదల చేసి, వీటిని ఎవరు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేసింది. అయితే చైనా యాప్స్ కొన్ని దేశ భద్రతకు ప్రమాదకరంగా భావిస్తున్న ఇండియన్ ఇంటెలిజెన్స్ వాటిని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి.

చైనాకు చెందిన 52 యాప్స్ పైన నిషేధం విధించాలని లేదా ప్రజలు వాటిని ఉపయోగించకుండా చూడాలని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కేంద్రానికి సిఫార్స్ చేశాయి. వీటి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించాయి. ఈ జాబితాలో టిక్‌టాక్, జూమ్, లైక్, హలో, షేర్‌ఇట్, క్లబ్ ఫ్యాక్టరీ, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్, ఎంఐ వీడియో, ఎంఐ స్టోర్ క్లాష్ ఆఫ్ కింగ్స్, క్లీన్ మాస్టర్, డీయూ బ్యాటరీ సేవర్, యూకామ్ మేకప్ తదితర యాభై రెండు యాప్స్‌ను నిషేధించాలి లేదా ప్రజలు ఉపయోగించకుండా చూడాలని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిఫార్స్ చేశాయి.
Tags:    

Similar News