• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జీవీకే అవినీతి పై...

జీవీకే అవినీతి పై రంగంలోకి ఈడీ: విచారణ షురూ!

By - Tupaki Desk
Update: 2020-07-04 14:00 GMT
ప్రముఖ కంపెనీ జీవీకే గ్రూపులో అవినీతి వెలుగులోకి రాగా దానిపై విచారణ మొదలైంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కేసులో ప్రమోటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కొందరిపై ఈడీ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే సీబీఐ ఈ కేసు వ్యవహారంలో రూ.705 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించింది.

జీవీకే గ్రూపు చైర్మన్  జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డి, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి చెందినవారితో సహా మొత్తం 14 మందిపై గత జూన్ 27వ తేదీన క్రిమినల్ కేసును దాఖలు చేసింది. చీటింగ్, ఫ్రాడ్, క్రిమినల్ కుట్ర వంటి పలు అభియోగాలు వచ్చాయి. వీరి వలన ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. హైదరాబాద్ లో జీవీకే రెడ్డితో కార్యాలయంతో బాటు ముంబైలో ముంబై ఇంటర్నేషల్ ఎయిర్ పోర్టుకు చెందిన అధికారుల ఆఫీసులపై ఈ సందర్భంగా సీబీఐ దాడులు చేసి సోదాలు నిర్వహించింది.

2012 నుంచే ప్రమోటర్ల అవకతవకల వ్యవహారం ప్రారంభమైందని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, మేనేజ్ మెంట్, డెవలప్ మెంట్ వంటి ఉన్నత ఆదర్శాలతో’ జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ జాయింట్ వెంచర్ 2006లోనే ఏర్పడినప్పటికీ.. ఆ తరువాత అక్రమాలు మొదలయ్యాయని తెలుస్తోంది. 2012లో రూ.395 కోట్ల దుర్వినియోగం జరిగిందని, ఎయిర్ పోర్ట్ ప్రీమియం రిటైల్ ఏరియాని ఈ గ్రూపు తమ కుటుంబసభ్యులు, బంధువులకు చాలా తక్కువ రెంటల్స్ తో అప్పగించారని సీబీఐ అధికారులు తెలిపారు. బోగస్ కాంట్రాక్టులు, తొమ్మిది బినామీ ఎంటీటీలు సాగించిన అవకతవకలపై దర్యాప్తు జరుగుతోంది.

ముంబై విమానాశ్రయ కంపెనీ ఈ ప్రమోటర్లు నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో హైదరాబాద్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మదుపు చేశారని తెలిసింది. దర్యాప్తులో తేలిన విషయాలన్నీ ఈడీకి సీబీఐ నివేదికగా తెలపనుంది.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News Tupaki Updates 
  • Tupaki 
  • Latest News 
  • Tupaki Media 

Similar News

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS