సిడ్నీలో తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజినీరు మృతి

Update: 2017-12-25 16:05 GMT
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్వస్థలంలో ఉన్న భార్యాబిడ్డలు ఆయన మరణ వార్త తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. మిర్యాలగూడకు చెందిన కోన ఆదినారాయణ రెడ్డి అనే 33 ఏళ్ల యువకుడు ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అయితే... సోమవారం ఆయన అనుమానస్పద స్థితిలో అతని గదిలోనే శవమై కనిపించాడు.
    
ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న ఆదినారాయణ ఉద్యోగ బాధ్యతల్లో భాగంంగా ఆరు నెలల కిందట సిడ్నీ వెళ్లాడు.  ఆదివారం సాయంత్రం మిర్యాలగూడలో ఉంటున్న భార్య శిరీషతో మాట్లాడాడు. అయితే.. ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించలేదు. దీంతో కంగారు పడిన కుటుంబసభ్యులు సిడ్నీలో ఉండే ఆదినారాయణ మిత్రులకు ఫోన్ చేయగా వారు అతని ఇంటికి వెళ్లారు. అలా వెళ్లినవారికి ఆదినారాయణ శవం కనిపించడంతో వారు షాక్ తిన్నారు.
    
వారు జరిగిన విషయాన్ని మిర్యాలగూడలోని ఆదినారాయణ కుటుంబ సభ్యులకు చెప్పగా వారు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఆయన ఎందుకు మరణించాడో... గుండెపోటా - ఆత్మహత్యా - లేదంటే ఎవరైనా హతమార్చారా అన్నది తెలియాల్సి ఉంది. ఆదినారాయణకు మూడేళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లలున్నారు. కాగా  ఆదినారాయణ మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
Tags:    

Similar News