అమెరికాలో తొలిసారి ఎగిరిన భారత జాతీయ జెండా

Update: 2020-08-16 08:50 GMT
అగ్రరాజ్యం అమెరికాలో మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. తొలిసారి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా.. ప్రతిష్టాత్మకంగా న్యూయార్క్ టైమ్ స్కైర్ లో భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వెన్నెల జెండాను ప్రవాస భారతీయులు ఎగురవేయడం విశేషం. వాషింగ్టన్ నుంచి హ్యూస్టన్ దాకా అమెరికాలోని పలుప్రాంతాల్లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ (ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో టైమ్స్ స్వ్కేర్ వద్ద వందలాది మంది ఎన్నారైల సమక్షంలో న్యూయార్క్ లోని భారత రాయబారి రణధీర్ జైస్వాల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.ఇక్కడ జెండా ఎగురవేసే అవకాశం రావడం గర్వకారణమని జైస్వాల్ అన్నారు. ఎంపైర్ స్టేట్ భవంతి వద్ద కూడా స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి.

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోనూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటి మేరి మిల్బెన్ జాతీయగీతం ఆలపించి ఔరా అనిపించారు. చాలా మంది హాలీవుడ్, అమెరికా ప్రముఖులు భారతీయులకు అభినందనలు తెలియజేశారు.
Tags:    

Similar News