ఆక్స్ ఫర్డ్ కి భారీ విరాళం ప్రకటించిన ఇండియన్ బిజినెస్ మెన్ ..ఎందుకంటే!

Update: 2020-07-17 07:00 GMT
కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ వ్యాప్తి చెందుతూ ..ప్రపంచం మొత్తం పాకింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకి వణికిపోతోంది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి దీనికి సరైన వ్యాక్సిన్ రాలేదు. అనేక దేశాల్లో కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కరోనా వ్యాక్సిన్ తయారీ లో బ్రిటన్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఆక్స్ ఫర్డ్  ముందు వరసలో కొనసాగుతుంది.  ఇప్పటికే  ఆక్స్ ఫర్డ్  యూనివర్శిటీ కరోనా వాక్సిన్ ట్రయల్స్ ను చేస్తున్నది. ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తున్నట్టు సమాచారం.

అయితే, ఈ వాక్సిన్ పై పరిశోధన చేయడానికి  డబ్బు అధిక మొత్తంలో అవసరం. ఈ కారణంతోనే  ప్రభుత్వంతో పాటుగా అనేక ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెడుతుంటాయి. అలాగే  బడా బడా వ్యాపారవేత్తలు విరాళాలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్రిటన్ లో వ్యాపారం చేస్తున్న ఇండియన్ బిజినెస్ మెన్ లక్ష్మి మిట్టల్  ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వ్యాక్సినాలజీ డిపార్ట్మెంట్ కు 3.5 మిలియన్ డాలర్ల విరాళం అందించారు.  ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసిందని, ఏ  మహమ్మారిని ఎదుర్కొనేందుకు వాక్సిన్ ను తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేస్తున్నారని, త్వరలోనే ఈ ప్రపంచం నుంచి కరోనా మహమ్మారిని తరిమికొడతామని తెలిపారు. లక్ష్మి మిట్టల్ విరాళం అందించిన వ్యాక్సినాలజీ డిపార్ట్మెంట్ విశ్వవిద్యాలయంలోని జెన్నర్ ఇన్స్టిట్యూట్ విభాగం కింద పనిచేస్తున్నది.
Tags:    

Similar News