పాక్ కంటే ద‌రిద్ర‌మైన రికార్డు బ‌య‌ట‌కొచ్చింది

Update: 2018-05-15 04:46 GMT
మ‌న‌కు తెలీకుండానే మ‌న చుట్టూ చాలా జ‌రిగిపోతుంటాయి. తాజా నివేదిక‌ను చూస్తే.. ఇదే మాట గుర్తుకు రావ‌టం క‌నిపిస్తుంది. దేశం చుట్టు ఉన్న దేశాల‌తో పోలిస్తే.. మ‌న దేశంలోనే కొన్ని ప‌రిస్థితులు ఉంటాయ‌ని.. స్వేచ్ఛ కూడా ఎక్కువ‌న్న మాట త‌ర‌చూ చెబుతుంటారు. కానీ.. కొన్ని అంత‌ర్జాతీయ నివేదిక‌ల్ని చూస్తే.. మ‌న దేశంలో అంత‌కంత‌కూ కొన్ని విష‌యాల్లో దిగ‌జారిపోతున్న వైనం కళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తుంది.

తాజాగా యునెస్కో ఒక నివేదిక‌ను వెల్ల‌డించింది. శాంతిభ‌ద్ర‌త ప‌రిర‌క్ష‌ణ పేరుతో ప్ర‌భుత్వాలు ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేసిన ఉదంతాల్లో భార‌త్ రికార్డు చాలా ఎక్కువ‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. కేవ‌లం ఏడాది వ్య‌వ‌ధిలో (2017 మే నుంచి 2018 ఏప్రిల్ మ‌ధ్య కాలంలో సౌత్ ఏషియాలో శాంతిభ‌ద్ర‌త‌ల ఇష్యూ త‌లెత్త‌కుండా ఉండేలా ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని భార‌త్ 97 సంద‌ర్భాల్లో నిలిపివేసిన‌ట్లుగా గుర్తించారు.

క్లాంప్ డౌన్ అండ్ క‌వ‌రేజ్ - సౌత్ ఏషియా ప్రెస్ ఫ్రీడం రిపోర్టు 2017-18 విడుద‌ల చేశారు. ఇందులో వివిధ దేశాల్లో ఎన్నిసార్లు చొప్పున ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేసిన వైనాన్ని లెక్క చెప్పారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య హింస‌ను అడ్డుకోవ‌టానికి పాకిస్తాన్ లో 12సార్లు.. ఆప్ఘ‌నిస్తాన్.. బంగ్లాదేశ్‌.. శ్రీ‌లంక‌లో ఒక్కొక్క‌సారి చొప్పున ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేసిన‌ట్లుగా తేలింది.

సాధార‌ణ ప్ర‌జానీకానికి ఇంట‌ర్నెట్‌.. ఇంట‌ర్నెట్ ఆధారిత మొబైల్ యాప్స్ లోని నేట్ వెగాన్నిత‌గ్గించ‌టం ద్వారా వారికి అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని అందుబాటులోకి లేకుండా చేస్తార‌ని తేల్చారు. ఈ విష‌యంలో ద‌క్షిణాసియా ముందు ఉంద‌న్న స‌ద‌రు నివేదిక‌.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక‌సార్లు నెట్ ష‌ట్ డౌన్లు భార‌త్‌లోనే ఎక్కువ‌గా ఉన్న‌ట్లుగా లెక్క క‌ట్టారు. దేశంలో 97సార్లు ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేస్తే.. అందులో స‌గానికంటే ఎక్కువ‌గా క‌శ్మీర్ లో ఎక్కువ‌గా ఉన్న‌ట్లుగా తేలింది.

జ‌మ్ముక‌శ్మీర్ త‌ర్వాత ఇంట‌ర్నెట్ సేవ‌ల స్తంభ‌న విష‌యంలో రాజ‌స్తాన్.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. బిహార్.. పంజాబ్.. హ‌ర్యానా రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌న్నారు. బిహార్ లో 40 రోజులు.. క‌శ్మీర్ లో 31 రోజుల పాటు నెట్ సేవ‌ల్ని నిలిపివేసిన‌ట్లుగా నివేదిక పేర్కొంది. ఇలాంటి ప‌రిస్థితి కార‌ణంగా పాత్రికేయుల‌కు స‌రైన స‌మాచారాన్ని పొందే వీలుండ‌ద‌ని.. భ‌ద్ర‌త పేరుతో ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన ఈ చ‌ర్య‌ల‌న్నీ మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తాయ‌న్న మాట‌ను చెబుతున్నారు.
Tags:    

Similar News