భారత్ వైపు చొచ్చుకొస్తున్న డ్రాగన్

Update: 2020-12-07 04:07 GMT
భారత్ సరిహద్దులవైపు డ్రాగన్ వ్యూహాత్మకంగా చొచ్చుకొస్తోంది. భార్-చైనా సహరిద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంకు కొద్ది దూరంలోనే చైనా మూడు గ్రామాలను నిర్మించినట్లు తాజాగా బయటపడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటు చైనా పాలకులు ఎప్పటి నుండో వాదిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేయటంలో భాగంగానే పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలోనే మూడు గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాలు, వీడియోల ద్వారా బయటపడింది.

ఈఏడాది ఫిబ్రవరి-నవంబర్ మధ్యలోనే కనీసం మూడు గ్రామాలను డ్రాగన్ వ్యూహాత్మకంగా నిర్మించేసింది. అతి తక్కువ కాలంలోనే ఎవరికీ అనుమానం రాకుండానే డ్రాగన్ దేశం గ్రామాలను నిర్మించేయటం ఆశ్చర్యంగా ఉంది. చైపా-నేపాల్ తో పాటు చైనా-భూటాన్  సరిహద్దుల్లో కూడా ఇలాగే ఓ గ్రామాన్ని నిర్మించేసిన విషయం గుర్తుండే ఉంటుంది. నేపాల్ సరిహద్దుల్లో అంటే నేపాల్ దేశభూభాగంలోకి చైనా చొచ్చుకెళ్ళిపోయింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ లోకి చొచ్చుకురాకుండా సరిహద్దులకు దగ్గరలోని తమ భూభాగంలోనే ప్రస్తుతానికి గ్రామాలను నిర్మించింది.

ప్రస్తుతానికి తన భూభాగంలోని సరిహద్దుల్లోనే డ్రాగన్ గ్రామాలను నిర్మించినా ముందు ముందు అరుణాచల్ ప్రదేశ్ లోకి చొచ్చుకుని వచ్చే వ్యూహంతోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. పైగా ఈ గ్రామాలు కూడా భారత్-చైనా-భూటాన్ దేశాలు కలిసే బూమ్ లా పాస్ సెంటర్లోనే  నిర్మించింది. పై సెంటర్ మూడు దేశాలకు చాలా కీలకమైనది. భారత్ ను ఇబ్బందులు పెట్టే ఉద్దేశ్యంతోనే డ్రాగన్ పై సెంటర్ ను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. పైగా 5 కిలోమీటర్ల పరిధిలోనే మూడు గ్రామాలను నిర్మించేసింది. ప్రతి గ్రామానికి మధ్య దూరం కూడా ఒక కిలోమీటర్ మాత్రమే.

డ్రాగన్ నిర్మించిన ఈ గ్రామాల్లో కరెంటు, మంచినీటి సౌకర్యం, ఇంటర్నెట్, డ్రైనేజి లాంటి అన్నీసౌకర్యాలూ ఉన్నాయి. మామూలుగా అయితే ఇటువంటి ప్రాంతాల్లో సాధారణ జనాలుండటానికి ఇష్టపడరు. అయినా చైనా ప్రతి గ్రామంలోను 50 ఇళ్ళను నిర్మించిందంటే ఇవి కేవలం సైనిక కార్యక్రమాల్లో ఉపయోగించుకునేందుకు మాత్రమే అని తెలిసిపోతోంది. ఈ గ్రామాల్లోని జనాలు ఏమి చేస్తున్నారంటే ఆధునిక ఆయుదాలతో  సరిహద్దులను కాపలా కాస్తున్నారట. దాంతోనే వాళ్ళంతా సైనికులే అని అందరికీ తెలిసిపోతోంది.
Tags:    

Similar News