భారత్ కు అమెరికా ఎఫ్ 16..అమెరికా లెక్కలు వేరేనా?
అగ్రరాజ్యం అమెరికా మన దేశంతో దౌత్యపరమైన సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు - రక్షణ పరమైన అంశాల్లో అండగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తుందనే విషయం తాజాగా మరోమారు రుజువు అయింది. వలస ఉద్యోగుల విషయంలో కాస్త కఠినంగా ఉంటున్నప్పటికీ భారతో దోస్తీ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ కు ఎఫ్-16 - ఎఫ్-18 ఫైటర్ విమానాలను అమ్మేందుకు ట్రంప్ పరిపాలనా వర్గం పచ్చజెండా ఊపింది. ట్రంప్ పరిపాలన వర్గంలో కీలక వ్యక్తి అయిన అలీస్ వెల్స్ ఈ విషయాన్ని అక్కడి మీడియాకు తెలిపారు.
దక్షిణ - మధ్య ఆసియా తాత్కాలిక సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అలీస్ వెల్స్ తాజాగా అమెరికా అధ్యక్షుడి నిర్ణయం గురించి వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎఫ్-16 - ఎఫ్ 18 యుద్ధ విమానాలను భారత్ కు అమ్మాలని డిసైడయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మేరకు అనుమతి కోరుతూ కాంగ్రెస్ కు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో వెల్స్ వివరించారు. ‘ భారత్ - అమెరికాల బంధం బలపడేందుకు ఎన్నో ఆవశ్యకతలు ఉన్నాయి. ఈ రెండూ ఉగ్రవాద సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశాలు. ముఖ్యంగా భారత్ చుట్టూ ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సరిహద్దుల గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయంగా భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా భావిస్తున్న అమెరికా..భారత్ కు సంబంధించిన కీలకమైన విషయంలో అండగా నిలబడాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది`` అని వివరించారు.
అదే సమయంలో అమెరికా సొంత ప్రయోజనాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని వెల్స్ నిర్మోహమాటంగా చెప్పారు. ఇండో - పసిఫిక్ రీజియన్ లో భారత్ అత్యంత శక్తివంతమైన - రక్షణాత్మకమైన దేశం మరొకటి లేదనే భావనలో అమెరికా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని అన్నారు. ఇదరు దేశాల మధ్య వాణిజ్య బంధం కూడా పెరుగుతోందని తెలిపారు. 2006లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు 2016 నాటికి 114 బిలియన్ డాలర్లకు చేరుకుందని అన్నారు. అన్నారు. అంటే పదేండ్ల కాలంలో మూడురెట్లకు పైగా వృద్ధిని నమోదు చేసుకుందని వివరించారు.