మొట్టమొదటి పార్సిల్ రైలు..విదేశాలకి మిర్చి ఎగుమతి !

Update: 2020-07-14 09:30 GMT
గుంటూరు అనగానే అందరికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు మిర్చి. గుంటూరు మిర్చి కి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. చాలా ప్రాంతాల్లో మిర్చి పంట పండిస్తున్న కూడా గుంటూరు మిర్చి కి ఉన్న డిమాండ్ మరే ఇతర ప్రాంతాల మిర్చికి ఉండదు. . గుంటూరు మిర్చి దేశాలు దాటి ఎగుమతి అవుతోంది. మిర్చి తరలింపు కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన రైలులో గుంటూరు మిర్చిని బంగ్లాదేశ్‌ కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఎక్కువ శాతం రైతులు మిర్చినే  సాగుచేస్తుంటారు. గుంటూరు మిర్చికి దేశవిదేశాల నుంచి గిరాకీ లభిస్తోంది. ఈ తరుణంలో తాజాగా  384 టన్నుల గుంటూరు మిర్చి సోమవారం బంగ్లాదేశ్ దేశానికి చేరుకుంది. దీనికోసం ప్రత్యేకించి ఓ రైలునే ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, దేశంలోనే ఇదే మొట్టమొదటి పార్సిల్ రైలు. 16 అతి పెద్ద బోగీలున్న ఈ స్పెషల్ రైలు గుంటూరు జిల్లా రెడ్డిపాలెం నుంచి శుక్రవారం బయల్దేరి ..బంగ్లాదేశ్ కి చేరుకుంది. ఇందులో 384 టన్నుల ఎండు మిర్చిని గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌ కు తరలించారు. ఈ రైలు 1,372 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. బంగ్లాదేశ్‌ లోని బెనపోల్ ప్రాంతానికి గుంటూరు మిర్చిని చేరవేసింది. ఈ మేరకు ఆలిండియా రేడియో న్యూస్ అధికారిక ట్విట్టర్‌ లో తెలిపింది.
Tags:    

Similar News