వజ్రోత్సవ భారతమా ... ఒక్కసారి ఆలోచించుమా

Update: 2022-08-16 17:30 GMT
మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర పదులు నిండాయి. ఎంతో అభివృద్ధి సాధించామని అంతా  భావిస్తున్నారు. ఏలికలు అయితే మహా గొప్పగా ప్రసంగాలు చేశారు.  

ఒకనాడు మనం గుండు సూదిని కూడా తయారు చేయలేని స్థాయి నుంచి ఈ రోజు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం, విశ్వం నలుమూలలా మనవాళే ది బెస్ట్ టాలెంటెడ్ పర్సెన్స్ గా ఉన్నరు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి అనుకున్నా మనకు చాలా విషయాల్లో బ్యాడ్ ర్యాంకులు ఇంకా ఉన్నాయి.

మన దేశం ప్రపంచంలో అతి పెద్ద ఆరవ ఆర్ధిక వ్యవస్థ. అంతే కాదు 2032 నాటికి మూడవ స్థానానికి కూడా చేరుకోబోతున్నాం. ఇది మనం గర్వంగా ఫీల్ అవాల్సిందే. అంతే కాదు తలసరి ఆదాయం విషయంలో మాత్రం మనది గతమెంతో అరవై డాలర్లు ఉంటే ఇపుడు 2,200 డాలర్లకు పెరిగింది. ఇది కూడా చాలా బాగానే ఉంది.

కానీ ఒక వైపు వేగంగా ఎదుగుతున్న ప్రపంచంలో మన తలసరి ఆదాయం ఎంత మనకు ఉన్న ర్యాంక్ ఎంత అన్నది కూడా లెక్క తీయాలి కదా. అలా కనుక చూసుకుంటే మన ప్లేస్ చాలా దారుణం అనే చెప్పాలి.

ఇది నిజం, నిష్టుర సత్యం కూడా. ఇలా కనుక చూసుకుంటే 205 దేశాలలో భారత్ తలసరి ఆదాయం స్థానం 158 గా ఉంది.  అంటే మనకంటే చాలా దేశాలు ముందు ఉన్నాయి.

ఇదేనా మన 75 ఏళ్ల అభివృద్ధి అని ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం తీరని బాధ కలిగి తీరుతుంది. ఇక దీని మీద మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్ చేస్తూ  అంతా ఒక్కసారి ఆలోచించాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు చాలా మందిని ఆలోచింపచేస్తోంది మరి.
Tags:    

Similar News