దేశంలో కేంబ్రిడ్జ్ అన‌లిటికాలెన్నో..సంచ‌ల‌న క‌థ‌నం

Update: 2018-05-01 04:58 GMT
ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌పంచాన్ని పెద్ద కుదుపున‌కు గురి చేసిన ఉదంతాల్లో బ్రిట‌న్ కు చెందిన కేంబ్రిడ్జ్ అన‌లిటికా అనే క‌న్స‌ల్టెన్సీ 1.7 కోట్ల మంది ఫేస్ బుక్ వినియోగ‌దారుల డేటాను దుర్వినియోగం చేయ‌టం ఒక‌టిగా చెప్పాలి. చ‌ట్ట‌విరుద్ధంగా సేక‌రించిన డేటాతో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌టం.. ఎన్నిక‌ల్లో తాము అనుకున్న ఫ‌లితం వ‌చ్చేలా చేయ‌టం కోసం వారు చేసిన దుర్మార్గం బ‌ట్ట‌బ‌య‌లైంది. దీనిపై ప్ర‌స్తుతం కోర్టులో కేసులు న‌డుస్తున్నాయి.

ఫేస్ బుక్ విశ్వ‌స‌నీయ‌త మీద సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేసిన ఈ ఉదంతం ప‌రిస్థితి ఇలా ఉంటే.. తాజాగా వెల్ల‌డైన ఒక సంచ‌ల‌న క‌థ‌నం భార‌త్ లో సంచ‌ల‌నంగా మారింది. బ్రిట‌న్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అన‌లిటికా మాదిరే.. దేశంలోనూ ప‌లు సంస్థ‌లు కోట్లాది మంది డేటాను ర‌హ‌స్యంగా సేక‌రిస్తున్నాయ‌ని తేలింది.

ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన ర‌హ‌స్య ఆప‌రేష‌న్లో ఉలిక్కిప‌డే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆన్ లైన్ వ్య‌వ‌స్థ‌పైనా.. స‌మాచారంపై దేశంలో స‌రైన నియంత్ర‌ణ చ‌ట్టాలు లేని కార‌ణంగా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేసేందుకు వీలుగా భార‌త్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌లు క‌న్సెల్టీలు ప‌ని చేస్తున్న‌ట్లుగా తేలింది.

వివిధ రాజ‌కీయ పార్టీల‌తో ఒప్పందాలు చేసుకున్న ఈ క‌న్స‌ల్టీలు ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌టం కోసం మేసేజ్ లు పంప‌టంతో పాటు.. త‌మ క్ల‌యింట్ల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని అందిస్తుంటాయి. మ‌రింత వివ‌రంగా చెప్పాలంటే.. ఢిల్లీకి చెందిన జ‌నాధార్ అనే క‌న్సెల్టీన్సీ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు తాము చేసే కార్య‌క్ర‌మాల గురించి ఇండియా టుడే ప్ర‌తినిధుల‌కు వెల్ల‌డించారు.

వారు చేసే ర‌హ‌స్య ఆప‌రేష‌న్ మీద అవ‌గాహ‌న లేని అత‌ను.. జ‌ర్న‌లిస్టుల‌ను క్ల‌యింట్లుగా భావించి తాము ఎలాంటి సేవ‌లు అందిస్తారో వివ‌రంగా చెప్పేశారు.  అనేక మార్గాల్లో తాము ఓట‌ర్ల జాబితాను సేక‌రించామ‌ని.. త‌మ ద‌గ్గ‌ర డేటా ఉంద‌ని.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తామ‌ని చెప్పారు. రెండోసారి ఇదే వ్య‌క్తితో క‌లిసి జ‌ర్న‌లిస్ట‌/క‌ఉ ఆయ‌న సౌత్ బెంగ‌ళూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రెండు ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల వివ‌రాల్ని సేక‌రించి ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

ఓట‌రు పేరు.. అడ్ర‌స్‌.. వారి ఫోన్ నెంబ‌ర్.. పాన్.. ఆధార్ నంబ‌ర్.. ఆర్థిక‌ప‌ర‌మైన వివ‌రాలు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా తాను ఇచ్చిన 2 ల‌క్ష ల‌మంది ఓట‌ర్లకు సంబందించి వారేం చేసినా.. దానికి సంబంధించిన వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తెలుస్తాయ‌ని చెప్ప‌టం చూస్తే.. ప్రైవ‌సీకి సంబంధించిన భ‌యాందోళ‌న‌లు చుట్టుముట్ట‌టం ఖాయం. అయితే.. తన ద‌గ్గ‌రున్న 2ల‌క్షల మంది ఓట‌ర్ల డేటాను ఇచ్చేందుకు స‌ద‌రు వ్య‌క్తి రూ.1.2కోట్లు డిమాండ్ చేయ‌టం చూస్తే..ఈ రాకెట్ విస్తృతి ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. టెలికం కంపెనీ అధికారుల‌తో కుమ్మ‌క్కు అయిన వివిధ సంస్థ‌లు.. ఒక్కో ప్రాంతంలోని ట‌వ‌ర్ల నుంచి వినియోగ‌దారుల వివ‌రాల్ని తాము సేక‌రిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఓట‌ర్ల డేటాతో ఐదారు శాతం ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ఇండియా టుడే జ‌రిపిన ప‌రిశోధ‌న స్ప‌ష్టం చేస్తోంది.
Tags:    

Similar News