భారత్ కోలుకోవాలంటే రూ.60 లక్షల కోట్ల ఎఫ్ డీఐలు కావాలంట!
కరోనా వైరస్ కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీనితో తిరిగి ఇది పుంజుకోవాలంటే రూ.50 లక్షల కోట్ల నుండి రూ.60 లక్షల కోట్ల వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) అవసరమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడుల అవసరాన్ని ఆయన తెలిపారు. మార్కెట్లోకి మనీని ఇన్ఫ్యూజ్ చేయాల్సి ఉందని , ఈ వైరస్ తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలంటే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు ఎంఎస్ ఎం ఈ రంగం ద్వారా మనీని ఇన్ఫ్యూజ్ చేయాలని, అందుకు ఎఫ్ డీఐలు కావాలన్నారు.
హైవేలు, విమానాశ్రయాలు, ఇన్ లాండ్ వాటర్ వేస్, రైల్వేస్, లాజిస్టిక్ పార్కులు, బ్రాడ్ గేజ్, మెట్రో వంటి మౌలిక రంగాలతో పాటు ఎంఎస్ ఎం ఈలు పెద్ద మొత్తంలో ఎఫ్ డీఐలను ఆకర్షించగలుగుతాయన్నారు. మార్కెట్లోకి ద్రవ్య లభ్యతను పంప్ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రోడ్ ట్రాన్సుపోర్ట్ సెక్టార్ లో ఎఫ్ డీఐలు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ తప్పలేదని, దీంతో ఆర్థికకార్యకలాపాల పైన భారీ ప్రభావం పడిందని గడ్కరీ చెప్పారు.
అందుకే ద్రవ్యలభ్యత అవసరం అన్నారు. ఎంఎస్ ఎం ఈ లు సహా వివిధ రంగాలకు నిధుల కోసం అమెరికా, దుబాయ్ లోని పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. మూడేళ్ల టర్నోవర్, జీఎస్టీ చెల్లింపుల తీరును పరిగణలోకి తీసుకొని ఈఎంఎస్ ఎం ఈలలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులను కోరినట్లు చెప్పారు. ఆర్థిక వృద్ధి సాధించాలంటే ఎగుమతులపై దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచాలని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. కోరనా కారణంగా ప్రపంచమంతా సమస్యలు ఎదుర్కొంటోందని, మౌలిక సదుపాయాల కల్పన యుద్ధ ప్రాతిపదికన చేయాలన్నారు.ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం కారణంగా భారీ నిధులు సమీకరించేందుకు ఉపయోగపడుతుందని గడ్కరీ చెప్పారు.