చైనాను అధిగమించే సత్తా భారత్ కి ఉంది!
చైనా ... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చౌక వస్తువులు తయారు చేసే దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. మన్నిక , ఎన్ని రోజులు ఉంటుంది అన్నది పక్కన పెడితే .. చైనా వస్తువులు మార్కెట్ లో ఇతర దేశాల వస్తువులతో పోల్చి చూస్తే చాలా తక్కువ ధరకే లభిస్తాయి. దీనితో చాలా మంది చైనా వస్తువుల వైపే చూస్తుంటారు. అయితే , చైనా కంటే చౌక ధర కె మేలిమి రకం వస్తువులు తయారు చేయాలనీ పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మారుతి సుజీకి ఇండియా ఛైర్మెన్ భార్గవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తలచుకుంటే, చైనాను చాలా ఈజీగా దాటేస్తుందని అన్నారు.
ప్రభుత్వం , పరిశ్రమలు కలిసి కట్టుగా పనిచేసి కంపెనీల మధ్య పోటీ పెంచాలని మారుతి సుజీకి ఇండియా ఛైర్మెన్ భార్గవ్ అన్నారు. ఇలా చేసినట్లయితే .. చౌక ఉత్పత్తిలో చైనా ను దాటే సత్తా భారత్ కి ఉందని తెలిపారు. పరిశ్రమల వ్యాపారమే .. ఇండియా లో ఉద్యోగ కల్పనకి మూలం అంటూ అయన వివరించారు. ఆర్థిక సమగ్రాభివృద్ధికి , అన్ని రంగాల్లో ఉద్యోగావకాశాలు పెంచడం కీలకం అని తెలిపారు. ఎంఎస్ ఎంఈ లు సైతం ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా సిద్ధం కావాలని కోరారు.
చైనా , భారత్ మధ్య సరిహద్దు వివాదం జరిగిన తర్వాత ప్రధాని మోడీ స్వదేశీ వస్తువులని మాత్రమే వాడండి దేశాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి అంటూ ఓ నినాదం ఇచ్చాడు. మోడీ చెప్పిన తర్వాత చాలా మంది చైనా వస్తువులని కొనడం మానేశారు. అలాగే మేడిన్ ఇండియా వస్తువులు కొనడం ప్రారంభించారు. ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి కట్టుగా నడుస్తూ , వారికీ ప్రజలు అండగా నిలిస్తే చైనా ను భారత్ చాలా త్వరగా , సులభంగా అధిగమిస్తుంది.