ఆ రెండు టీకాలకు అనుమతి ఇచ్చేశారు..వారంలో షురూ

Update: 2021-01-03 08:30 GMT
అంచనాలకు మించిన వేగంతో నిర్ణయం తీసుకుంది ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ). మరో వారం తర్వాత కానీ రావనుకున్న అనుమతుల్ని.. రోజు వ్యవధిలోనే అనుమతి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇప్పటికే సీరమ్ సంస్థ రూపొందించిన (ఆక్స్ ఫర్డ్ -  ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్ తో పాటు.. హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన (ఐసీఎంఆర్.. పుణె ఎన్ఐవీ సహకారంతో) టీకాలకు ఆమోదముద్ర పడింది. దీంతో.. ఈ టీకాల్ని అత్యవసర అనుమతులకు అందరికి వినియోగించుకునే అవకాశం లభించినట్లైంది.

ఈ రోజు (ఆదివారం) ఈ రెండు టీకాలకు ఆమోదం లభించింది. కొత్త వైరస్ అంతకంతకూ విస్తరించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న వేళలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావటం గమనార్హం. ఈ నేపథ్యంలో మరో వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో పాటు.. దేశ వ్యాప్తంగా తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమం షురూ కానుందని చెప్పాలి.

సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్ ను.. కోవిషీల్డ్గ్ గా వ్యవహరిస్తుంటే.. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను కోవాగ్జిన్ గా వ్యవహరిస్తున్నారు. రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించటంపైన ప్రధాని మోడీ స్పందించారు. తాజాగా వచచ్చిన అనుమతులతో భారత్ ఆరోగ్యవంతమైన కోవిడ్ రహిత దేశంగా మార్చేందుకు సహకరిస్తుందన్నారు. అనుమతులు వచ్చిన రెండు వ్యాక్సిన్లు భారత్ లోనే తయారు కావటం గర్వకారణమన్నప్రధాని.. కోవిడ్ పై యుద్ధం కీలక మలుపు తిరిగిందన్నారు.


Tags:    

Similar News