• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్ చేసే పాడు పనిని...

పాక్ చేసే పాడు పనిని ఓపెన్ గా చెప్పేశాడు

By - Tupaki Desk
Update: 2016-11-28 04:07 GMT
ప్రపంచ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఉగ్రవాదుల్ని పెంచి పోషించే నైజం ఉన్న పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని ఆ దేశానికి చెందిన ప్రముఖుడు ఒకడు తొలిసారి బట్టలు విప్పదీశాడు. ఉగ్రవాదానికి.. పాకిస్థాన్ కు అవినాభావ సంబంధం ఉందంటూ భారత్ చేసే ఆరోపణలు వంద శాతం నిజమన్న విషయాన్ని ఆయన తేల్చేశారు. అమెరికాలో పాక్ రాయబారిగా పని చేసిన పాకిస్థానీ ప్రముఖుడు ఒకరు తన దేశం చేసే పాడు పనిని ఓపెన్ గా చెప్పేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. ఆ దేశ దుర్మార్గ బుద్ది ప్రపంచానికి తెలిసేలా చేశారని చెప్పాలి.

ఉగ్రవాదం.. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నందుకు మిగిలిన దేశాల కంటే పాకిస్థాన్ కే  ఎక్కువ నష్టం వాటిల్లిందని చెప్పేశారు. అఫ్ఘనిస్థాన్.. కశ్మీర్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదాన్ని అక్కున చేర్చుకుంటున్న వైఖరి కారణంగా తమ దేశం ఎంతగా నష్టపోతుందో చెప్పిన ఆయన.. ఈ విషయం పాక్ కూడా గ్రహించిందని చెప్పారు. ఉగ్రవాదం కారణంగా భారత్ కంటే కూడా పాకిస్థాన్ కే ఎక్కువగా నష్టపోయిందన్న మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. అదే సమయంలో పాక్ ను ఇరుకున పడేసేలా చేశాయి.

గతంలో అమెరికాలో పాక్ రాయబారిగా వ్యవహరించిన హక్కానీ.. కశ్మీర్ సమస్యపై కూడా స్పందించారు. అదే సమయంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతకు కారణం ఏమిటన్నది తన మాటల్లో చెప్పేసిన ఆయన.. ఈ తీరు మారనంత వరకూ సమస్య పరిష్కారం కాదన్నారు. ఆర్మీ చీఫ్ ను మార్చటంతో ఎలాంటి ప్రయోజనం ఉందని తేల్చేసిన ఆయన.. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ భుజాన వేసుకొని తిరుగుతుందన్న మాటను చెప్పేశారు. మరి.. తన దేశానికి చెందిన ప్రముఖుడు ఒకరు చేసిన తాజా వ్యాఖ్యలపై పాక్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    
  • India 
  • Pakistan 
  • Husain Haqqani 

Similar News

డిసెంబరులో కీలక మార్పులు.. రాయలసీమ నుంచి కొత్త మంత్రులు

2026-11-02 13:55 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

'పదకొండు' ముహూర్తం బాగుంది.. వాళ్లు భుజాలు తడుముంటే నేనేం చేయాలి : విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-02 13:50 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

Copyright @2026

Powered by Blink CMS