బంజారాహిల్స్ లో ఆ నకిలీ విలేకరిని తుక్కు బెల్లం చేయటం ఒక్కటే తక్కువట
విలేకరి అన్నంతనే సమాజం పట్ల బాధ్యత.. అనురక్తి.. పేద ప్రజల గొంతుకై నిలవటం.. వారి సమస్యల పరిష్కారం కోసం వార్తలు రావటం లాంటివి గతించిన కాలానికి సంబంధించిన మాటలుగా మారాయి. అందరూ కాదు కానీ చాలా ఎక్కువ మంది విలేకరులన్నంతనే.. అపరిమితమైన అధికారాలేవో తమ చేతుల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతుంటారు. తమ ప్రొఫెషన్ కు ఇచ్చే మర్యాదను.. గౌరవాన్ని తప్పుగా అర్థం చేసుకొని హడావుడి చేస్తుంటారు.
ఇలాంటి వారిని చూసిన కొందరు మోసగాళ్లు విలేకరుల అవతారం ఎత్తుతూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ నకిలీ విలేకరుల హడావుడి అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. తమకు సంబంధం లేని అంశాల్లో తలదూరుస్తున్నారు. అక్రమ భవన నిర్మాణం లేదంటే నిబంధనలకు భిన్నంగా నిర్మించే భవననిర్మాణదారుల వద్దకు వెళ్లటం.. వారిని వార్తలు రాస్తామని బెదిరించటం.. ఫోటోలు తీసుకొని హడావుడి చేయటం ఈ మధ్యన ఎక్కువైంది.
సాధారణంగా రిపోర్టర్ ఎవరైనా సరే.. చిన్న చిన్న నిర్మాణాల అక్రమాల్ని వార్తలుగా రాయరు. ఒకవేళ వార్తలు రాయాలనుకునే వారెవరూ కూడా.. భవన నిర్మాణదారుల వద్దకు వచ్చి.. మీరు అక్రమంగా నిర్మాణం ఎందుకు కడుతున్నారని అడగరు. దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి వార్తలుగా రాస్తారు. ఇలాంటి వారు పెద్దగా బయటకు ఫోకస్ కారు. కానీ.. హడావుడిగాళ్లు.. నకిలీ రిపోర్టర్లు మాత్రమే వసూళ్ల కార్యక్రమానికి పాల్పడుతుంటారు. ఇలాంటి వారు ఈ మధ్యన ఎక్కువయ్యారు.
అది కూడా ఎంతవరకు అంటే.. తాజాగా బంజారాహిల్స్ లోని ఒక బిల్డర్ వద్దకు వచ్చి ఫోటోలు తీయటమే కాదు.. డబ్బులు వసూలుకు డిమాండ్ చేస్తున్నారు. తాజా ఉదంతం విషయానికి వస్తే.. గతంలో వేరే విలేకరులతో కలిసి వచ్చిన ఒక వ్యక్తి.. తాజాగా మరొకరిని వెంట బెట్టుకొని వచ్చి భవనం వద్ద ఫోటోలు తీస్తున్నారు. దీంతో.. బిల్డర్ వర్గీయులు పట్టుకునేప్రయత్నం చేస్తే ఒకరు పారిపోగా.. మరొకరు దొరికారు. అలా పారిపోయిన వ్యక్తి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫోన్ చేసి.. తాము అడ్వర్టైజ్ మెంట్ కోసం వెళితే.. బిల్డర్ ఒకరు తమ రిపోర్టర్ ను బంధించారని సమాచారం వచ్చారు.
దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. భవన యజమాని వద్దకు వచ్చి సదరు విలేకరిని విడిచిపెట్టాలని కోరారు. అయితే.. అతడు నకిలీ విలేకరన్న విషయం తెలిసిన వారు అవాక్కు అయ్యారు. గతంలో అదే విలేకరు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్న వైనం పోలీసులకు అర్థమై.. తమకే మస్కా కొట్టిన వారి కోసం వెతుకుతున్నారు. పోలీసులు రాక ముందు సదరు నకిలీ విలేకరిని పట్టుకున్న బిల్డర్ మనుషులు చితక్కొట్టేసినంత పని చేశారని చెబుతున్నారు. నకిలీ విలేకరులకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది.