నదులు, చెరువుల్లో నిమజ్జనం నిషేధం

Update: 2020-12-18 04:14 GMT
దేవుడంటే అందరికీ ప్రేమ.. అందరికీ భక్తి ప్రవత్తులే.. అయితే ఆ దేవుడి పేరుతో పర్యావరణాన్ని మనిషి కలుషితం చేస్తున్నాడు. రంగురంగుల పాస్టర్ ఆఫ్ ప్యారీస్ గణేషుడి విగ్రహాలు వేయడంతో చెరువులు, నదులు కాలుష్యకారకాలుగా మారుతున్నాయి. దీనిపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు ఉన్నా అమలు కావడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలోని నదులు, చెరువుల్లో విగ్రహాలు నిమజ్జనం చేయడాన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పూజా సామగ్రి కూడా వాటిల్లో వేయరాదని తెలిపింది.

జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు, గంగానది శుద్ధి జాతీయ మిషన్ సూచనలు మేరకు మున్సిపల్ కమిషనర్లకు కాలుష్య నియంత్రణ మండలి ఈ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఈ చర్యల వల్ల నీటి కాలుష్యం భారీగా తగ్గుతుందని భావిస్తున్నారు.ఇప్పటికైనా ప్రజలు నదులు,చెరువుల్లో ఈ దేవతా విగ్రహాలను వేయకుండా ఉంటారా? ఈ ఆదేశాలు అమలు అవుతాయా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News