ఇలాంటి కస్టమర్లు తగిల్తే ప్రతిరోజూ పండగే..!
కొంతమంది దయార్ద హృదయులైన కస్టమర్లు అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వస్తుంటారు. అక్కడ పనిచేసే సిబ్బందిపై జాలితో భారీగా టిప్‌లు ఇస్తుంటారు. చాలా మంది కస్టమర్లు మాత్రం విసుక్కుంటూ టిప్ ఇస్తారు. వేలకు వేలకు రెస్టారెంట్‌కు బిల్లు కడతారు.. కానీ అక్కడ వడ్డించేవాడికి ఓ వంద రూపాయలు ఇచ్చేందుకు వందసార్లు ఆలోచిస్తుంటారు.
కానీ అమెరికాలోని ఓ హోటల్‌కు వెళ్లిన ఓ ధనవంతుడు .. కేవలం రూ. 500 బిల్లు చెల్లించి.. అక్కడి పనిచేసేవాళ్లకు రూ. 2 లక్షలు టిప్‌గా ఇచ్చాడు. హోటల్లో పనిచేసే సర్వర్లంతా ఆ టిప్‌ను పంచుకోవాలని సూచించాడు. దీంతో వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
యూఎస్ లోని ఓహియో రాష్ట్రం.. క్లీవ్‌లాండ్ నగరంలోని ‘‘నైట్ టౌన్’’ అనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి తరచూ వస్తుంటాడు. అక్కడ ఉండే డ్రింక్స్, స్నాక్స్ అతడికెంతో ఇష్టం. గత ఆదివారం కూడా అలాగే హోటల్‌కు వచ్చాడు. ఒక స్టెల్లా డ్రింక్ ఆర్డర్ చేశారు. రెండు సిప్పులు మాత్రం తాగాడు. ఆ తర్వాత బిల్ ఇవ్వాలని అడిగాడు. ఏడు డాలర్లు అయింది బిల్. కానీ సదరు వ్యక్తి మాత్రం ఈ బిల్లుకు మరో 3000 వేల డాలర్లు టిప్ కలిపి ఇచ్చాడు. సదరు యజమాని ఆశ్చర్యపోయాడు. పొరపాటున అలా ఇచ్చాడేమోనని ఒకటికి రెండు సార్లు చెక్ చేశాడు. అతడు మొత్తం మూడువేల ఏడు డాలర్లు ఇచ్చినట్టు గమనించాడు. అయితే అతడు రెగ్యులర్ కస్టమర్.. పొరపాటున అలా ఇచ్చాడేమోనని భావించాడు.
బయటకు వెళ్లిపోతున్న అతడిని పిలిచాడు. ‘ సార్ మీరు పొరపాటున 3000 డాలర్లు ఇచ్చారు’ అన్నాడు. కానీ సదరు వ్యక్తి ‘నేను పొరపాటున ఇవ్వలేదు. టిప్గానే ఇచ్చా. ఈ డబ్బును మీ హోటల్లో పనిచేసే సిబ్బందికి సమానంగా పంచి ఇవ్వండి మెరీ క్రిస్మస్’ అని చెప్పి వెళ్లిపోయాడు. హోటల్ యజమాని ఆశ్చర్యపోయాడు. తన సిబ్బందికి ఆ డబ్బును పంచేశాడు.
ఈ సందర్భంగా ఆ హోటల్ యజమాని బ్రెండన్ రింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఓహియో స్టేట్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జనవరి వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలనుకున్నాం. ఈ రోజు (ఆదివారం) చివరిరోజు. మా హోటల్లో పనిచేసే సిబ్బంది ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడుతారని తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఓ వ్యక్తి మా హోటల్‌కొచ్చి ఇంత టిప్ ఇవ్వడం నిజంగా నమ్మలేకపోయా. ఆ డబ్బును ఆరోజు డ్యూటీలో ఉన్నవారందరికీ తలా 750 డాలర్లు పంచాను. ఈ రోజుల్లోనూ ఇటువంటి మనుషులు ఉండటం గ్రేట్’ అని అన్నాడు.