• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  ఇద్దరు భార్యలు.. 18 మంది...

ఇద్దరు భార్యలు.. 18 మంది పిల్లలు సరిపోలేదు.. కట్ చేస్తే?

| ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాకు చెందిన మున్నా అలియాస్ ముస్తాకా గుల్షన్ అనే వ్యక్తి సుమన్ దేవి అనే వివాహితతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు

By - Garuda Media
Update: 2026-03-24 07:30 GMT

కొందరి కక్కుర్తి గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ఒక మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా వెలుగు చూసిన వివరాలు దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించేలా మారాయి. దీనికి కారణం.. హత్యకు గురైన వ్యక్తి కక్కుర్తి మరీ ఇంత దారుణమా? అన్నట్లు ఉండటమే. హతుడికి అప్పటికే ఇద్దరు భార్యతలతో పాటు పద్దెనిమిది మంది సంతానం ఉన్నప్పటికీ.. సరిపోదన్నట్లు మరో మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడి ప్రాణాలు పోయేలా చేసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాకు చెందిన మున్నా అలియాస్ ముస్తాకా గుల్షన్ అనే వ్యక్తి సుమన్ దేవి అనే వివాహితతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయితే.. ఆమెను బలవంతంగా వివాహేతర సంబంధంలోకి లాగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తరచూ కలవాలని వేధింపులకు దిగటంతో విసిగిపోయిన మహిళ.. తన సోదరుడితో కలిసి మున్నాను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది.

తాము వేసుకున్న పథకంలో భాగంగా మార్చి 18న మున్నాను ఇంటికి ఆహ్వానించిన సదరు మహిళ.. అతడు ఇంట్లోకి అడుగు పెట్టినంతనే మహిళ సోదరుడు..అతడి స్నేహితులు వెనుక నుంచి ఇనుపరాడ్లతో దాడి చేయటంతో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం డెడ్ బాడీని గోనెసంచెలో కుక్కి పంటకాలువలో పడేశారు. మున్నా కనిపించకపోవటంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మున్నా ఫోన్ కాల్ ఆధారంగా సదరు మహిళను గుర్తించారు. ఆమెను విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అనంతరం పంట కాలువ నుంచి మున్నా డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపారు. మున్నాకు ఇద్దరు భార్యలని.. ఒక్కొక్కరికి తొమ్మిది మంది చొప్పున సంతానం ఉన్నట్లుగా విచారణలో తేలింది. ఇద్దరు భార్యలు.. పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నప్పటికి మరో మహిళను వేధింపులకు దిగిన వైనం షాకిచ్చేలా మారింది.

Tags:    
  • uttarpradesh 
  • crime 
  • murdercase 
  • breakingnews 
  • india 
  • pratapgarh 

Similar News

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

రీల్స్ పిచ్చి పరాకాష్ట.. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నం!

2026-11-07 02:29 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

Copyright @2026

Powered by Blink CMS