రజనీ దృష్టిలో నేనూ సంఘవ్యతిరేకినే! కమల్
తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణ పనులను నిలిపివేయాలని జరిగిన నిరసనలు ఉద్రిక్త రూపం దాల్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం రేపిన తూత్తుకుడి కాల్పుల ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ ఘటనకు బాధ్యులైన తమిళనాడు సర్కార్ - పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఫ్యాక్టరీ విస్తరణపనులను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందన వివాదాస్పదమైంది. సమస్యల పరిష్కారానికి ప్రజలు రోడ్లెక్కితే, తమిళనాడు శ్మశానంలా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రజనీ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా, విశ్వ నటుడు, 'మక్కళ్ నీది మయ్యమ్` పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్....రజనీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆందోళనలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, అలా ఆందోళనలు చేస్తే తమిళనాడు శ్మశానమవుతుందని రజనీ వ్యాఖ్యానించడం పెను దుమారం రేపింది. ఆ ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చేరి హింసను ప్రేరేంపించాయని రజనీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా, రజనీపై కమల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యేందుకు బెంగళూరు వెళుతోన్న కమల్....చెన్నై ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. ఆందోళనకారులను రజనీ సంఘ వ్యతిరేకులుగా భావిస్తున్నారని, అటువంటి సమయంలో తానుకూడా సంఘ వ్యతిరేకినేనని కమల్ అన్నారు. ఆందోళనకారులపై తుపాకులు ఎక్కుపెడితే ప్రజలు ఎదురొడ్డి నిలిచి పోరాడాలని కమల్ పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారానికి, లక్ష్య సాధనకు ప్రజలు ఉద్యమాలు చేస్తుంటారని అన్నారు. అయితే, ఆందోళనల సందర్భంగా హింస జరిగే పరిస్థితులను నియంత్రించాలని, హింసను తగ్గించాలని కోరాలే తప్ప అసలు ఉద్యమమే లేకుండా చేసేలా వ్యాఖ్యలు చేయకూడదన్నారు. మరి, కమల్ వ్యాఖ్యలపై రజనీ స్పందన ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.