మోడీ అలా చేస్తే.. కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం!

Update: 2023-02-18 08:00 GMT
తెలిసి చేసినా.. తెలియ‌క చేసినా.. రాజ‌కీయాల్లో కొంద‌రు చేసే ప్ర‌క‌ట‌న‌లు.. ప‌నులు కూడా ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌రంగా మారుతుంటాయి. ఇప్పుడు కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని గ‌మ‌నిస్తున్న‌వారు.. వ‌చ్చే నవంబ‌రు లేదా.. డిసెంబ‌రులో జ‌రిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గ‌ద్దెనెక్కించేందుకు కేంద్రం బాగానే క‌ష్ట‌ప‌డుతోంద‌ని అంటున్నారు. గ‌త 2018 ఎన్నిక‌ల్లోనే కేసీఆర్ ఇంటికి వెళ్లిపోతార‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

అయితే.. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవ‌డంతో ప‌డిలేచిన కెర‌టం లెక్క‌.. కేసీఆర్ పుంజుకు న్న‌రు. మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేసిన్రు. దీనిని అడ్డుపెట్టుకుని.. ఆయ‌న మ‌రోసారి ఆంధ్రోళ్లొస్త‌న్న‌రు! అంటూ.. యాగి చేసి పెట్టిన్రు! దీంతో తెలంగాణ గుండుగుత్త‌గా మ‌రోసారి కేసీఆర్‌కు ప‌గ్గాలు అప్ప‌గించిం ది. ఇక‌, ఇప్పుడు వ‌రుస‌గా రెండు సార్లు పాల‌న చూసిన ప్ర‌జ‌లు కేసీఆర్‌ను చూడ‌బుద్దెయిత‌లేంద‌నేది .. ఒక టాక్ న‌డ‌స్తోంది.

ఇది కూడా నిజ‌మే. కేంద్రంతో క‌య్యం పెట్టుకున్న కేసీఆర్‌కు.. ప‌నులు కావ‌డం లేదు. నిధులు రావ‌డం లేదు. అప్పులు పుట్ట‌డం లేదు. దీంతో ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న హామీలు నెర‌వేర్చ‌డం కూడా క‌ష్టంగానే ఉంది. అయితే.. ఇప్పుడు ఈ ప‌రిణామాల మ‌ధ్య‌లో కేంద్రం చేస్తున్న ఒక చిన్న‌ప‌ని.. మ‌రోసారి కేసీఆర్ సార్‌కు వ‌రంగా మారుతోంద‌ని అంటున్నారు  ప‌రిశీల‌కులు. అదే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.

ఈ కేసులో ఎన్నిక‌ల స‌మ‌యానికి ఒక‌టి రెండు మాసాల ముందు కేసీఆర్ కుమార్తె క‌విత‌ను ఇరికించి జైలు కు పంపే ఏర్పాట్లు ఏవో జ‌రుగుతున్నాయ‌ని మీడియా కోడై కూస్తోంది. ప్ర‌స్తుతం ఆమె భ‌ర్త అనిల్‌ను కూడా విచారించే ప్ర‌య‌త్నంలో ఉంద‌ని.. ఇది పూర్తి కాగానే మ‌రో రెండు మూడు మాసాల్లోనే ఆమెను కూడా ఈ కేసులో ఇరికించి.. జైలుకు పంపేయాల‌ని చూస్తోంద‌ని అంటున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. దీనిని సెంటిమెంటుగా మార్చుకుని కేసీఆర్ సారు మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News