పోలవరం వైఎస్ ఆర్ ప్రారంభించారు..జగన్ పూర్తి చేస్తారు

Update: 2020-11-17 17:33 GMT
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తవుతుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్షం టీడీపీ తరచూ ఆరోపణలు చేస్తోంది. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్ కాపర్ డ్యాం పనులని పలిశీలించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదిత ఎత్తులో అంగుళం కూడా తగ్గే ప్రసక్తే లేదని, పోలవరం డెడ్ స్టోరేజ్ నుండి నీళ్ళు విశాఖకు తరలించడానికి ప్రయత్నిస్తుంటే ఎత్తు తగ్గిస్తున్నారు, కాంట్రాక్టర్స్ తో లాలూచీ పడ్డారంటున్నారని , కానీ, మేము ఏంచేస్తున్నామో అందరికి తెలుసు అని అన్నారు. అనుమానముంటే టీడీపీ నేతలు పోలవరం వచ్చి ..ఎత్తు కొల్చుకోవచ్చని తెలిపారు. అనవసరమైన ప్రచారాలు మాని..ధైర్యముంటే 2017 కేంద్ర కేబినెట్ లోని ఏయే అంశాలకు ఆమోదం తెలిపారో వచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. ఎన్నిసార్లు పోలవరం పోయామన్నది కాదు, ఎంత చిత్త శుద్ధితో వెళ్ళమనేది కావాలన్నారు. అన్నిసార్లు పోలవరం పోయాం, అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాం అంటారు, అయినా కూడా అవగాహన లేకుండా మాట్లాడతారని విమర్శలు గుప్పించారు. 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది...వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ..పోలవరం పూర్తి చేసేది వైఎస్ జగన్ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

పోలవరం ప్రాజెక్టుతో పాటు , ఆ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందిన వంద అడుగుల ఎత్తు విగ్రహాన్ని కూడా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లను చేపడతామని , విగ్రహం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకి ఆదేశాలు జారీచేశామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
Tags:    

Similar News