మూడు రెట్లు ప్రభావవంతంగా పని చేసే యాంటీబాడీలు గుర్తింపు

Update: 2021-12-30 09:31 GMT
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. వివిధ దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసినటువంటి కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయినా ఓమిక్రాన్ 130 కి పైగా దేశాలలో పాగా వేసింది. కేసుల సంఖ్య కూడా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలలో భారీగా నమోదవుతున్నాయి.

ఒక్కరోజులోనే లక్షల సంఖ్యలో వైరస్ కేసులు వెలుగు చూస్తుండడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఇలా ఉంటే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కొందరు కొత్త వేరియంట్ పైన కీలక పరిశోధనలు చేశారు.

వీటిలో మానవుని శరీరంలో కొత్త వేరియంట్ను అడ్డుకునే యాంటీబాడీలు గుర్తించారు. సాధారణంగా కరోనా వైరస్ శరీరంలో కొన్ని సార్లు ఉత్పరివర్తనాలు చెందుతుంది. అయితే ఇలా ఉత్పరివర్తనం చెందిన వైరస్ ను కూడా అడ్డుకునే సామర్థ్యం ఉందని సంబంధించిన కొన్ని యాంటీ బాడీలకు ఉందని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ఈ మేరకు వారు చేసిన పరిశోధనకు సంబంధించిన కీలక విషయాలను నేచర్ అనే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మెడికల్ కు సంబంధించిన పత్రికలో ప్రచురించారు. అయితే అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం యాంటీబాడీలు మానవ శరీరంలో ఎక్కువగా ఉంటే వైరస్ తో పోరాడే శక్తి కూడా పెరుగుతుందని అన్నారు. ఈ కారణంగా వైరస్ సోకిన వారు ఆసుపత్రి పాలు అయ్యే అవకాశం తక్కువ ఉంటుందని తెలిపారు.

అమెరికా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెలుగు చూసిన అంశాలు... భవిష్యత్తులో కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెందిన కానీ వాటికి సంబంధించిన చికిత్స కు అవసరమయ్యే టీకాలను తయారు చేయడంలో ఉపయోగపడుతాయని అంటున్నారు. స్పైక్ ప్రోటీన్ ఉండే కొన్ని భాగాలు కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెందిన.. వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఆ భాగాలకు ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

వీటిని యాంటీ బాడీలు గా గుర్తించినట్లు పేర్కొన్నారు. యాంటీ బాడీలు వైరస్ ఎంత మ్యుటేషన్ చెందిన కానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వీటిలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయినా ఒమిక్రాన్ ను ఎదుర్కొనే శక్తి వీటిలో అధికంగా ఉంటుందని పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు.

ఒమిక్రాన్ ను ఎదుర్కోవడంలో సోట్రో విమాంబ్ అనే ఒక యాంటీ బాడీ కీలకంగా వ్యవహరిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి ఒమిక్రాన్ ను ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. అందుకే కొత్త వేరియంట్ పై 3 రెట్లు అధిక ప్రభావం తో పని చేస్తుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే గతంలో వెలుగుచూసిన అటువంటి కొన్ని కరోనా వైరస్ వేరియంట్లో పై పోరాడిన కొన్ని యాంటీ బాడీలు ఒమిక్రాన్ ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.

ఒమిక్రాన్ పై పోరాటంలో మొదటి డోసు తీసుకున్న వారి కంటే రెండో డోసు తీసుకున్న వారు ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అందుకే బూస్టర్ డోస్ ఖచ్చితంగా తీసుకోవాలని వివిధ ప్రభుత్వాలు సూచిస్తున్నట్లు పరిశోధన నిర్వాహకులు తెలిపారు.


Tags:    

Similar News