అమ్మ మ‌ర‌ణానికి ఐస్‌ క్రీం, చాక్లెట్లు కార‌ణ‌మంట‌

Update: 2017-02-09 16:14 GMT
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం విష‌యంలో అనూహ్య‌మైన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. అమ్మ మ‌ర‌ణానికి అతిగా చాక్లెట్లు - ఐస్ క్రీం స్వీక‌రించ‌డ‌మే కార‌ణ‌మ‌ని తేలింది. ఈ విష‌యాన్ని జ‌య‌ల‌లిత‌కు వైద్యం చేసిన శంక‌ర్ అనే వైద్య నిపుణుడు తెలిపారు. తాజాగా ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడుతూ జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో చేరిన స‌మ‌యంలో బీపీ - షుగ‌ర్‌ - థైరాయిడ్‌ - అర్థ‌రైటిస్ వంటి అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. అమ్మ‌ ఆస్ప‌త్రిలో చేరిన స‌మ‌యంలో శ‌రీరంలో చ‌క్కెర స్థాయి తారాస్థాయికి చేరింద‌ని, ఆమెకు చాక్లెట్లు - ఐస్ క్రీంల‌పై ఉన్న విప‌రీత‌మైన ప్రేమ ఇందుకు కార‌ణ‌మ‌ని డాక్ట‌ర్ శంక‌ర్ విశ్లేషించారు.

త‌న షుగ‌ర్ లెవెల్స్‌ ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు జ‌య‌ల‌లిత త‌ర‌చుగా ఇన్సులిన్ ను ఉప‌యోగించేవార‌ని డాక్ట‌ర్ వివ‌రించారు. ఇలా సుదీర్ఘ‌కాలం పాటు స్టెరాయిడ్ల‌ను ఉప‌యోగించ‌డం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌ని తెలిపారు. అమ్మ ఆరోగ్య స్థితిని సాధార‌ణ స్థాయికి తెచ్చేందుకు తాను పెద్ద ఎత్తున కృషి చేసిన‌ట్లు డాక్ట‌ర్ శంక‌ర్ వెల్ల‌డించారు. 2016 మే వ‌ర‌కు అమ్మ ఆరోగ్యం బాగానే ఉంద‌ని తెలిపారు.

కాగా... దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత మృతిపై అపోలో వైద్యులు వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత‌కు ప్రత్యేక‌ చికిత్స‌ను అందించిన బ్రిట‌న్ డాక్ట‌ర్ రిచ‌ర్డ్ బేల్ తో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వ వైద్యుడు డాక్ట‌ర్ బాలాజీ - క్రిటిక‌ల్ కేర్ క‌న్స‌ల్‌ టెంట్  డాక్ట‌ర్ బాబూ అబ్ర‌హం కూడా జ‌య ఆరోగ్య ప‌రిస్థితిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఊపిరి పీల్చుకోవ‌డం తీవ్ర స‌మ‌స్య ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌తో సెప్టెంబ‌ర్ 22న రాత్రి 10.30 గంట‌ల‌కు జ‌య‌ల‌లిత ఆస్ప‌తిలో చేరార‌ని, ఆమెకు వెంట‌నే క్రిటిక‌ల్ కేర్ ట్రీట్‌ మెంట్‌ ను అందించామ‌ని వారు వివ‌రించారు. ఇన్‌ ఫెక్ష‌న్ వ‌ల్ల ఊపిరి స‌మస్య‌లు ఉత్ప‌న్న‌మైన‌ట్లు అనుమానించామ‌ని డాక్ట‌ర్ తెలిపారు. సెప్పిస్ వ‌ల్లే ఆమె అవ‌య‌వాలు దెబ్బ‌తిన్నాయ‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు. ర‌క్తంలో బాక్టీరియా ఉండ‌డాన్ని వైద్య ప‌రిభాష‌లో సెప్పిస్ అంటారు. సెప్పిస్ చాలా వేగంగా శ‌రీర‌మంతా సోకుతుంద‌ని, కొన్ని గంట‌ల్లోనే మ‌నిషి దాని వ‌ల్ల అనారోగ్యంగా మారే అవ‌కాశాలున్నాయ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. జ‌య డ‌యాబెటిస్‌ తోనూ బాధ‌ప‌డ్డార‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఇన్‌ ఫెక్ష‌న్ తీవ్ర స్థాయిలో ఉన్నందు వ‌ల్లే జ‌య‌ను వెంటిలేట‌ర్‌ పై పెట్టాల్సి వ‌చ్చింద‌న్నారు. జ‌య మృతిచెందిన రోజున ఆమె శ‌రీరంలో పొటాషియం స్థాయి సాధార‌ణంగా ఉంద‌ని డాక్ట‌ర్ బాబు తెలిపారు. జ‌య వెంటిలేట‌ర్‌ పై వెళ్ల‌గానే ఆమెకు నిద్ర మాత్ర‌లు ఇచ్చామ‌ని, దాని వ‌ల్ల ఆమెతో మాట్లాడ‌లేక‌పోయిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. కానీ జ‌య మేల్కొన్నప్పుడు మాత్రం సంకేతాలు చేసేద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. జ‌య‌కు సంబంధించి ఎటువంటి అవ‌యవాల‌ను తొలిగించ‌డం కానీ, మార్పిడి కానీ జ‌ర‌గ‌లేద‌న్నారు. జయకు వైద్యం చేయడం సదావకాశంగా భావిస్తానని, ఆమె అసాధారణ మహిళ అన్నారు. జయ మృతి అంశంలో ఎటువంటి కుట్ర జరగలేదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News