తెలంగాణ విద్యాశాఖలో వివాదాలకు కేరాఫ్ గా ఆ ఐఏఎస్ వ్యవహారం

Update: 2023-01-28 13:46 GMT
ఆయనో హై ఐఏఎస్.. చదువుల శాఖలో కీలక అధికారి. ఈ అవకాశాన్ని ఆయన 'క్యాష్' చేసుకుంటున్నారు. అందినకాడికి దోచుకుంటున్నాడు. అటు వివాదాలు సృష్టిస్తూ కేరాఫ్ గా మారుతున్నాడు. ఆయన వ్యవహారం వల్ల ఆ శాఖకే చెడ్డపేరు వస్తోంది. ఈయన గత ప్రభుత్వంలో ఓ కీలక శాఖలో పనిచేశారు. అక్కడా తన చేతివాటం చూపించారు. ఇది గుర్తించిన మంత్రి తన శాఖకు చెడ్డపేరు వస్తుందని, వేరే విభాగానికి మార్చారు. కానీ ఇక్కడా ఆయన పద్దతి మార్చుకోలేదు. అయితే ఆయన వ్యవహారం వల్ల ఇతరులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆయనను వేరే చోటుకు బదిలీ చేయండి ప్రభోనని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవినీతి రహిత పాలననే  ధ్యేయంగా సాగుతున్న ప్రభుత్వంలో కొందరు అధికారుల చేష్టల వల్ల వ్యవస్థే మారిపోతుంది. తాను ఉన్నతస్థాయిలో ఉన్నానన్న అవకాశవాదంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం విద్యాశాఖలో పనిచేస్తున్న ఈ అధికారి ప్రైవేట్ సూల్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారట.

డబ్బులు ఇవ్వకపోతే స్కూల్స్ రద్దు చేసేవరకు చర్యలు తీసుకుంటున్నాడట. కొన్ని స్కూళ్లకు అన్ని నిబంధనలు ఉన్నా.. ఏదో ఒక సాకుతో పనులు, ఫైళ్లు పక్కనబెడుతున్నారు. ఆయన అడిగినంత ఇస్తే పనికానిచ్చేస్తున్నారు.

కొందరు ఈయన వ్యవహారంపై ఫిర్యాదులు చేయడానికి వెనుకాడుతున్నారట. ఎందుకంటే రాజకీయ పలుకుబడితో ఆయనకు అండదండలు ఉన్నట్లు సమాచారం. అందుకే విద్యాశాఖలో ఆయనతో పనిచేయించుకునేవాళ్లు ఎలాంటి వాదనకు వెళ్లకుండా డబ్బులు ముట్టజెప్పుతున్నారట. ఇక ఆయన పని ఆయన చేసుకోకుండా ఇతరుల విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారట. అనవసర వివాదాలు సృష్టించి శాఖ కు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

వచ్చే ఐఏఎస్ బదిలీల్లో ఈయనను మార్చాలని కొందరు కిందిస్థాయి ఉద్యోగులు కోరుతున్నారు. ఆయన వల్ల తాము బాధలు పడలేకపోతున్నామని మొర పెట్టుకుంటున్నారు. అయితే బహిరంగంగా మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. ఒకవేళ అలా చేస్తే తమ ఉద్యోగానికే ఎసరు పడే ప్రమాధం ఉందని భయపడుతున్నారు.

ఇప్పటికైనా ఆ అధికారి విషయంలో చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికే ఆయన గురించి తెలిసిన ప్రభుత్వం ఇప్పడు ఆయన గురించి పట్టించుకుంటుందా..? వదిలేస్తుందా..? చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News