వికిలీక్స్ ఎప్పటికి లీక్ చేయనిది లీకైంది

Update: 2017-02-16 08:24 GMT
ప్రపంచంలో ఏదేశమైనా కావొచ్చు. అత్యంత గుట్టుగా చేసిన విషయాల్ని సైతం తన పాత్రికేయ నేత్రంతో సమాచారం మొత్తాన్ని తీసుకొచ్చేయటమే కాదు.. దేశాధినేతలకు సైతం షాకుల మీద షాకులు ఇచ్చేస్తుంటారు. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాను సైతం తన తీరుతో గడగడలాడించిన తీరు వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే సొంతంగా చెప్పాలి.

అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ ముప్పు నుంచి బయటపడటం కోసం లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఏళ్ల తరబడి ఉంటున్నారు అసాంజే. ఆ ఎంబసీ కార్యాలయం నుంచి బయటకు వచ్చినమరుక్షణం ఆయనను అరెస్ట్ చేసేందుకు పలు దేశాలకు చెందిన భద్రతాధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. ఓపక్క ఎంబసీలో తలదాచుకుంటున్న అసాంజె.. వివిధ దేశాలకు చెందిన సమాచారాన్ని.. రహస్య డాక్యుమెంట్లను బయటకు తీసుకొచ్చే పనిని చేస్తూనే ఉన్నారు. కాకుంటే.. గతమంత దూకుడు కాదనే చెప్పాలి.

తన తీరుతో ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారిన అసాంజె ప్రేమలో పడిపోయింది హాలీవుడ్ అందాల నటి పమేలా అండర్సన్. వీరిద్దరి మధ్య లవ్వాట మొదలైనట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చినా.. వీరిద్దరిలో ఎవరూ కన్ఫర్మ్ చేసింది లేదు. తాజాగా మాత్రం.. వీరి మధ్య ఏదో జరుగుతుందన్న విషయం అర్థమయ్యేలా పమేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

అసాంజే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని.. ఆయనకు హెల్ప్ చేయాలని.. ఆయన ముఖంలో ఆనందం కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఆయన్నుకలవటానికి ఎవరూ రారని.. అదే సమయంలో ఆయన ఎవరిని కలవరన్న పమేలా.. ‘ఆయన మన కోసం ఎన్నో త్యాగాలుచేశాడు. నిజమైన వార్తలకు వికీలీక్స్ ఒక్కటే ఆధారం. ఆయన్ను ముఖ్యమైన వ్యక్తిగా చరిత్ర గుర్తిస్తుంది’’ అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మరీ.. మాటల్ని చూస్తే.. అమ్మడికి అసాంజె మీద ఎంత లవ్వు ఉందో తెలియట్లేదు. వీకీలీక్స్ లీక్ చేయని సమాచారం ఏమైనా ఉందంటే.. అది అసాంజే.. పమేలా మధ్య సాగే రొమాంటిక్ ఎపిసోడేనేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News