• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నార్త్ కాలిఫోర్నియాలో...

నార్త్ కాలిఫోర్నియాలో యాదాద్రి జిల్లా కుర్రాడి మృతి

By - Tupaki Desk
Update: 2019-04-07 16:50 GMT
తెలంగాణ యువకుడు అమెరికాలో అనుమానాస్పద మృతి చెందాడు.  యాదాద్రి జిల్లా భువనగిరిలోని నల్లపోచమ్మ వాడ కాశీ విశ్వనాథ్(26) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.  మూడున్నరేళ్ల క్రితం ఉద్యోగ రిత్యా విశ్వనాథ్ అమెరికా వెళ్లాడు. అక్కడ  ఇన్ఫోసిస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఆయన  తన గదిలో శవమై కనిపించాడు.

    ఉదయం 10 గంటల వరకు విశ్వనాథ్‌ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు గది తలుపులు పగలగొట్టి లొపలికి వెళ్లారు. అక్కడ విశ్వనాథ్‌ అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసులకు సమచారమిచ్చారు. అనంతరం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే విశ్వనాథ్‌ మరణించాడు.

    కాగా ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, గతంలో తనకేమైన ఆరోగ్య సమస్యలున్నాయా? అని కాశీవిశ్వనాథ్‌ పెద్దనాన్న కుమారుడు ధన్‌శ్యాం నాథ్‌ను వైద్యులు అడిగారు. కాశీ విశ్వనాథ్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతడి పెద్దనాన్న ఎన్‌.అశోక్‌ చెప్పారు. విశ్వనాథ్‌ మృతిపై తమకు అనుమానాలున్నాయన్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపిస్తామని ఇన్ఫోసిస్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారన్నారు.

    26 ఏళ్ల యువకుడు ఏ కారణం లేకుండా చనిపోవడంపై సందేహాలు వ్యక్తమవతున్నాయి. ఫోరెన్సిక్ పరీక్షలు, పోలీసు విచారణ తరువాత వాస్తవాలు వెల్లడికానున్నాయి. ఆయనది సహజ మరణమా.. లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది.
Tags:    
  • Hyderabad Techie 
  • Telugu News 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS