హైద‌రాబాద్‌ కు మ‌రో ఘ‌న‌త‌..సూప‌ర్ ఫాస్ట్ జాబితాలో చోటు

Update: 2018-12-07 01:30 GMT
ముత్యాల న‌గ‌రం హైదరాబాద్‌ కు మరో అరుదైన గుర్తింపు లభించనుంది. ఇప్ప‌టికే వివిధ ప్ర‌మాణాలు - జాబితాల్లో త‌న ముద్ర వేసుకున్న ఈ నంగ‌రంలో ఇప్పుడు ప్ర‌పంచంలో మ‌రో క్రేజీ లిస్ట్‌ లో త‌న ఎంట్రీని పొంద‌నుంది. ప్రపంచంలో 2019 నుంచి 2035 మధ్య సూపర్ ఫాస్ట్ గా అభివృద్ధి పొందే టాప్‌ 20 నగరాల లిస్టులో హైదరాబాద్ చేరనుంది. ఆక్స్‌ ఫర్డ్‌ ఎకనమిక్స్‌ రిపోర్ట్ వెల్లడించిన ఈ లిస్టులో  సూరత్ టాప్‌ లో నిలవగా.. వరుసగా ఆగ్రా - బెంగళూర్‌ - హైదరాబాద్ - నాగపూర్‌ - తిరుపూర్‌ -రాజ్‌ కోట్‌ - తిరుచిరాపల్లి - చెన్నై - విజయవాడలు నిలిచాయి.

ఆక్స్‌ ఫర్డ్‌ ఎకనమిక్స్ వార్షిక ప్రపంచ నగరాల రీసెర్చ్ రిపోర్ట్ ప్ర‌కారం 2018-2035 మధ్య సూరత్‌ 9.2 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత నగరాల లిస్టులో నెంబర్‌ వన్‌ గా నిలిచింది. భారత్‌ వెలుపల కంబోడియా రాజధాని ఫెమ్‌ ఫన్‌ అత్యధికంగా 8.1 శాతం సగటు వార్షిక వృద్ధితో ఎదుగుతాయని ఈ అధ్య‌యనం తెలిపింది. ఆసియా నగరాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నా.. 2035 నాటికీ అమెరికా నగరం న్యూయార్క్‌ ప్రపంచంలోనే అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా తన ప్రతిష్టను నిలుపుకుంటుందని అంచనా వేసింది. ఈ రీసెర్చ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు ఎక్కువగా ఇండియాలోనే ఉన్నాయని తెలిపింది.  2035 నాటికి ఈ నగరాల మొత్తం GDP చైనా నగరాల GDPతో పోల్చితే తక్కువగానే ఉంటుంది.  ఉత్తర అమెరికా - యూరప్‌ నగరాల కంటే అధికంగా చైనా నగరాలే 2035 నాటికి అత్యధిక ఉత్పత్తులు సమకూరుస్తాయని అంచనా వేసింది. కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఈ ఎపిసోడ్‌ పై స్పందిస్తూ ఇండియా అభివృద్ధి చెందడం దేశానికే గర్వకారణం అని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News