రేసర్ల కక్కుర్తితో మరో యాక్సిడెంట్‌

Update: 2015-04-12 08:53 GMT
రద్దీ లేకుండా విశాలంగా ఉండే ఔటర్‌ రింగురోడ్డుపై రేసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. తమకున్న కక్కుర్తిని ఐటర్‌ రింగురోడ్డు మీద తీర్చుకునే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకోవటం.. పెద్దఎత్తున ప్రమాదాలకు గరి కావటం తెలిసిందే.

తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల ఎంతగా హెచ్చరిస్తున్నా వినకుండా వ్యవహరిస్తున్న రేసర్లు మరో ప్రమాదానికి గురయ్యారు. హిమాయత్‌సాగర్‌ వద్ద రెండు కార్లు ఢీకొట్టుకొని ఒక కారులో నుంచి మంటలు చెలరేగాయి.

దీంతో..కార్లలో ఉన్న వారు బయటకు దూకి తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు. జనసంచారం లేని చోట చోటు చేసుకున్న ఈ ప్రమాదం నుంచి ఏమీ ఎరగనట్లు తప్పించుకుపోయారు. ఈ ఘటనను కాస్త ఆలస్యంగా గుర్తించిన పోలీసులు.. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. అసలు వాళ్లు తప్పించుకుపోయిన నేపథ్యంలో కొసరు వారు మాత్రమే మిగలటం.. దానికి మరెన్ని ఫిట్టింగ్‌ పెట్టి.. చివరకు ఎటూ తేలకుండా చేసినా ఆశ్చర్యం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News