హైదరాబాద్ లో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్ లో దారుణం జరిగింది. వివాహితను నిర్భంధించి నాలుగురోజుల పాటు నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పహడీ షరీఫ్ పరిధిలోని హర్షగూడలోని ప్రసాద్ రెడ్డి పౌల్ట్రీఫామ్ లో ఈ దారుణం జరిగింది.
హర్షగూడలోని ప్రసాద్ రెడ్డి పౌల్ట్రీఫామ్ లో పనిచేస్తున్న మహిళపై ఈ అఘాయిత్యం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది ఎవరో కాదు.. స్వయానా పౌల్ట్రీఫామ్ యజమాని ప్రసాద్ రెడ్డితో పాటు ఆయన స్నేహితులు ముగ్గురు..
నాగర్ కర్నూల్ జిల్లా పెనుమెల్లెకు చెందిన ముదావాత్ చందు తన భార్యతో కలిసి పని కుదుర్చుకున్నాడు. నాలుగు నెలల క్రితం ఈ దంపతులు ఇక్కడ పనిలోకి వచ్చారు.
ఈ నెల 18వ తేదీన అర్థరాత్రి 12 గంటలకు పౌల్ట్రీఫామ్ కు వచ్చిన ప్రసాద్ రెడ్డి వేరే ఫామ్ లో పని ఉందని చెప్పి చందూని అతడి భార్యను తీసుకెళ్లాడు. చందూకి మత్తు ఇచ్చి ఒక గదిలో బంధించారు. అతడి భార్యపై ప్రసాద్ రెడ్డితోపాటు ముగ్గురు గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు.
నాలుగు రోజుల పాటు నలుగురు వ్యక్తులు ఈ అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని ప్రసాద్ రెడ్డి బెదిరించినట్టుగా బాధితురాలు చెబుతోంది. ఈ మేరకు పహడీ షరీఫ్ పోలీసులకు బాధిత మహిళ శుక్రవారం ఫిర్యాదు చేసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బాధిత మహిళ బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.