• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టిక్ టాక్ మోజులో భార్య .....

టిక్ టాక్ మోజులో భార్య .. తట్టుకోలేని భర్త ఏంచేసాడంటే ..?

By - Tupaki Desk
Update: 2019-11-08 10:16 GMT
టిక్ టాక్ ..టిక్ టాక్ .టిక్ టాక్ ..ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ టిక్ టాక్ లో వీడియోలు చేస్తున్నారు. స్కూల్ కి వెళ్లే పిల్లలు స్కూల్ లో , కాలేజ్ స్టూడెంట్స్ ..ఒకవైపు క్లాస్ చెప్తున్నా కూడా టిక్ టాక్ మోజులో పడి  వీడియోలు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే .. ఈ టిక్ టాక్ ప్రభుత్వ ఉద్యోగాలకి కూడా పాకింది. పనులకోసం ప్రభుత్వ ఆఫీసులకి వచ్చే వారిని పట్టించుకోకుండా టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇది పక్కన పెడితే ఈ టిక్ టాక్ వల్ల ఇప్పటికే చాలా మృత్యువాత పడ్డారు. టిక్ టాక్ వీడియోలు చేస్తూ కొందరు ప్రాణాలు వదిలితే .. టిక్ టాక్ తెచ్చిన తంటాలు వల్ల కొందరు ప్రాణాలు వదిలారు. టిక్ టాక్ లో చేసే వీడియో క్రేజీగా ఉండాలని భావించి , కొత్తగా ట్రై చేసే సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ మధ్య టిక్ టాక్ వల్ల కొన్ని కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి.

తాజాగా ఈ టిక్ టాక్ వల్ల ప్రకాశం జిల్లా లో ఘోరం జరిగింది. టిక్ టాక్ లో వీడియోలు చేయద్దు అని భర్త చెప్పినా కూడా వినకుండా వీడియోలు చేస్తుండటం తో క్షణికావేశంలో చేసిన ఒక చిన్న పొరపాటుతో ఆమె ప్రాణాలు వదిలితే .. ఆ భర్త ఇప్పుడు కటకటాలపాలైయ్యాడు. దీనికి ప్రధాన కారణం టిక్ టాక్.

పూర్తి వివరాలు చూస్తే .. ఆంధ్రప్రదేశ్ , ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో చిన్నపచు సాహిబ్, ఫాతిమా అనే దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. సాహిబ్ ఒక టైలర్. కానీ , అనుకోకుండా అక్టోబర్ 27 న  ఫాతిమా ఉరి వేసుకొని చనిపోయింది. ఆమె వయస్సు 30 ఏళ్ళు. దీనితో అందరూ మొదట్లో ఫాతిమా ఏవో కుటుంబ కారణాలతో ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయింటుంది అని అనుకున్నారు. కానీ , ఫాతిమా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులకి పెద్ద షాక్ తగిలింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఫాతిమా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోలేదు అని , ఎవరో బలంగా కొట్టడం వల్ల చనిపోయింది అని తేలింది.

దీనితో ఈ మిస్టరీని బయటపెట్టడానికి రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా ఆమె బంధువులని , పక్కింటి వారిని విచారించారు.  గత కొన్ని రోజులుగా టిక్ టాక్ కారణంగా భార్య , భర్త లకి గొడవలు జరుగుతుండేవి అని తెలుసుకున్నారు. ప్రతి రోజు ఫాతిమా టిక్ టాక్ లో వీడియోలు చేస్తుండేది .. కానీ , ఆమె భర్త మాత్రం టిక్ టాక్ లో వీడియోలు పెట్టవద్దు అని చెప్తూ వచ్చాడు. ఇక ఒక రోజు ఈ విషయం పై ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో భాగంగా ఫాతిమా భర్త సాహిబ్ ...ఇంట్లో ఉన్న చపాతీ కర్ర తో ఫాతిమా తలపై గట్టిగా కొట్టాడు. దీనితో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ఆ తరువాత ఆమెని ఫ్యాన్ కి ఉరి వేసి ..ఆత్మహత్య చేసుకున్నట్టు అందరిని నమ్మించాడు. కానీ , పోలీసులు భర్త ని తమదైన శైలిలో విచారించగా .. మొత్తం జరిగిన విషయాన్ని బయపెట్టేసాడు. దీనితో సాహిబ్ పై మర్డర్ కేసు నమోదు చేసి ..జైలుకి తరలించారు.   
Tags:    
  • Husband 
  • wife 
  • TikTok videos 
  • Telugu News 
  • Telugu Cinema News 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS