గంజాయి సేవించి.. కత్తులతో హల్ చల్ చేసింది మన హైదరాబాద్ లోనే

Update: 2020-12-03 04:00 GMT
ఈ ఫోటోలు చూసినంతనే.. ఇంత ఆరాచకం ఎక్కడ్రా బాబు అన్న భావన  కలుగక మానదు. బారు కత్తుల్ని పట్టుకొని రోడ్ల మీద హల్ చల్ చేసిన ఈ దారుణం హైదరాబాద్ లోని అత్తాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో గంజాయి వాడకం హైదరాబాద్ మహా నగరంలో బాగా పెరిగిపోయింది. అయితే.. బరితెగించినట్లుగా ఇంతలా దారుణ పరిస్థితి ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదనే చెప్పాలి.

అత్తాపూర్ లోని మారుతినగర్ లో (రాజేంద్ర నగర్ నియోజకవర్గం) కొందరు వ్యక్తులు గంజాయి సేవించి రోడ్ల మీద రెచ్చిపోయారు. కత్తులు పట్టుకొని హల్ చల్ చేయటమే కాదు.. పలువురు పట్ల అసభ్యంగా వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. వీరి దెబ్బకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ.. మత్తులో ఊగిపోతూ ఇలా వ్యవహరించటమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వీరి తీరును అక్కడి స్థానికులు అడ్డుకున్నారు.

దీంతో.. వారు మరింత చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో స్థానికుల సమాచారంతో ఆకతాయిల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి ఆరాచకం ఇటీవల కాలంలో చూడలేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివారి విషయంలో చూసీ చూడనట్లుగా మాత్రం వ్యవహరించకూడదంటున్నారు. పేకాటను తెలంగాణలో రూపుమాపామని చెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కత్తులతో ఈ రేంజ్ లో హడావుడి చేస్తున్న మత్తుగాళ్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News