ఏపీ డిప్యూటీ సీఎంకు హైకోర్టులో భారీ షాక్!

Update: 2021-04-18 07:30 GMT
ఎస్టీ హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం అయిన పుష్ప శ్రీవాణి చిక్కుల్లో పడ్డారు. ఆమె అసలు ఎస్టీ కాదని.. విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పుష్ప శ్రీవాణిని తొలగించాలని ఎన్నికల సంఘం, గవర్నర్ ను ఆదేశించాలని పిటీషన్ వేశారు.

దీనిపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సహా సంబంధిత ప్రభుత్వ యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది.

కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి గెలిచి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని చాలా కాలంగా వివాదం నడుస్తోంది. పుష్ప శ్రీవాణి సోదరి రామతులసిని నాన్ ఎస్టీగా గుర్తిస్తూ ఆమెను ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా తొలగించారు.

అయితే తన చెల్లెలును తొలగించింది నాన్ ఎస్టీ వివాదం కాదని.. నాన్ లోకల్ అంశమని.. తాము ముమ్మాటికీ ఎస్టీలమే అని శ్రీవాణి వాదిస్తోంది.

తాజాగా శ్రీవాణి ఎస్టీ హోదాపై ఓ రిటైర్డ్ టీచర్ మరో పిటీషన్ దాఖలు చేయగా.. దానిని శుక్రవారం విచారించిన హైకోర్టు ప్రతివాదులందరికీ శనివారం నోటీసులు జారీ చేసింది.
Tags:    

Similar News