• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  1.2 లక్షల ఫొటోలు.. 30...

1.2 లక్షల ఫొటోలు.. 30 టీబీ హార్డ్ డిస్క్స్

By - Tupaki Desk
Update: 2018-12-20 10:14 GMT
భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహం బడా పారిశ్రామికవేత్త ఆనంద్ పరిమల్ తో  అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మీడియా విస్తృత కవరేజ్ దక్కింది. ఈ విలాసవంతమైన వివాహానికి దేశంలోని ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ నటీనటులు.. రాజకీయ నాయకులు హాజరయ్యారు.

ఇషా-ఆనంద్ పరిమల్ వివాహానికి ఫొటోలు తీసే అవకాశం ప్రముఖ ఫొటోగ్రాఫర్  మంగళూరు కు చెందిన 47 ఏళ్ల వివేక్ సెక్కిరాకు దక్కింది.  వివేక్ దేశంలోనే  వివాహాలకు ఫొటోలు తీసే ప్రముఖ ఫొటోగ్రాఫర్ గా గుర్తింపు పొందాడు. ఈయన ఇప్పటికే బెస్ట్ ఫొటో గ్రాఫర్ గా 2010,2011, 2012, 2014 సంవత్సరాలకు గాను అవార్డులు పొందారు. అంబానీలకు చెందిన సన్నిహితుల పరిచయాల ద్వారా వివేక్ కు ఈ పెద్ద ఆఫర్ వచ్చిందట.

డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉండాలని మొదట వివేక్ కు చెప్పారట.. కానీ అక్టోబర్ లోనే అంబానీల వివాహానికే తనను ఎంపిక చేశారని తెలుసుకొని వివేక్ సంభ్రమాశ్చార్యాలకు గురయ్యాడట.. ఈ ఆఫర్ విషయం తెలిసి రెండు రోజుల పాటు వివేక్ కు నిద్ర కూడా పట్టలేదని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత తేరుకొని మామూలు మనిషిని అయ్యానని వివరించాడు.

అంబానీల వివాహం లో మొత్తం 1.2 లక్షల ఫొటోలను 17మంది తో కూడిన వివేక్ బృందం ఇప్పటివరకు తీశారట.. ఆ ఫొటోల సామర్థ్యం 30 ట్రిలియన్ జీబీ వరకు ఉంటుందని తెలిపారు. వివాహ ముందస్తు వేడుకల నుంచి పూర్తయ్యేక వరకు ప్రతి మూమెంట్ ను ఫొటోల్లో బంధించారట..

ఒక నెలరోజుల్లో ఫొటోలను అన్ని ఏర్చి కూర్చి అల్బమ్ తయారు చేయనున్నట్టు వివేక్ తెలిపారు. ఎంతో కష్టంతో కూడిన ఈ పనిని త్వరగానే పూర్తి చేస్తానని ఆయన తెలిపారు.
Tags:    
  • Isha Ambani Wedding 
  • Vivek Sequeira 
  • Mangalorean photographer 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS