ఆ టికెట్ చాలా హాట్ గురూ!
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం ప్రస్తుతం యావత్ తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 11 మంది నేతలు తమ తమ గాడ్ ఫాదర్ల ద్వారా ఈ టికెట్ కోసం హైకమాండ్ దగ్గర పైరవీలు చేయిస్తుండటం.. అవసరమైతే రూ.కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడుతుండటం గమనార్హం.
గతంలో పటాన్ చెరులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ - ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కాంగ్రెస్ కీలక నేతలుగా ఉండేవారు. 2014 ఎన్నికల తర్వాత వీరు కాంగ్రెస్‌ను వీడారు. అనంతరం అమీన్‌పూర్ మాజీ సర్పంచ్ కాట శ్రీనివాస్ గౌడ్ - కార్పొరేటర్ శంకర్ యాదవ్ - జిన్నారం జడ్పీటీసీ ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఎదిగారు. ఇక ఆర్నెళ్ల క్రితం బీజేపీ నుంచి అంజిరెడ్డి దంపతులు నాగం జనార్ధన్ రెడ్డితోపాటు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అమీన్ పూర్ మాజీ సర్పంచ్ శశికళాయాదవ్ టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితోపాటు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక పటాన్‌చెరు టికెట్‌ను మహిపాల్ రెడ్డికి టీఆర్ ఎస్ కేటాయించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు గాలి అనిల్ కుమార్ - బాల్ రెడ్డి - సపాన్ దేవ్ - వడ్డెర రాములు కూడా కాంగ్రెస్ లో చేరారు.
ఇలా కొత్తగా కాంగ్రెస్ లో చేరిన నేతలు - ఏళ్లుగా పార్టీనే అట్టిపెట్టుకున్న ఈ నేతలంతా ప్రస్తుతం పటాన్ చెరు టికెట్ ఆశిస్తున్నారు. అధిష్ఠానం వద్ద పేరున్న నేతలతో పైరవీలు కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి ద్వారా శశికళా యాదవ్ - నాగం జనార్ధన్ రెడ్డి ద్వారా అంజిరెడ్డి - మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ద్వరా కాట శ్రీనివాస్ గౌడ్ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. గాలి అనిల్ కుమార్.. దామోదర రాజనర్సింహతోపాటు విజయశాంతితో కూడా టికెట్ వేట కొనసాగిస్తున్నారు. కులం - డబ్బు లెక్కలు హైకమాండ్ కు వివరిస్తున్నారు. గెలిచేందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజుల తరబడి అక్కమే మకాం వేస్తున్నారు. గంటగంటకూ తమ గాడ్ ఫాదర్లకు ఫోన్ చేస్తూ టికెట్ స్టేటస్ తెలుసుకుంటున్నారు. దీంతో ఎవరికి టికెట్ వస్తుందనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.