అధికారిక ప్ర‌క‌ట‌న స‌రే.. రెండు కొత్త జిల్లాల ఊసేదీ..!

త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ధిని పొందాల్సి ఉంటుంది. కానీ, ఆ దిశ‌గా ఎక్క‌డా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు.;

Update: 2026-02-11 05:11 GMT

ఏపీలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాట‌య్యాయి. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన డిమాండ్లతో పాటు పాల‌న సౌల‌భ్యం కోసం కూట‌మి ప్ర‌భుత్వం 26 జిల్లాల‌ను 28కి పెంచింది. దీనిలో మార్కాపురం(ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కొన్ని మండ‌లాల‌ను విడ‌దీసి ఏర్పాటు చేశారు.), పోల‌వ‌రం (ప్ర‌స్తుతం ప్రాజెక్టు నిర్మిత మ‌వుతున్న ప్రాంతంతోపాటు.. ఇత‌ర ప్రాంతాల‌ను కూడా క‌లుపుతూ ఏర్పాటు చేశారు.) జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. అయితే.. స‌హ‌జంగా కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసిన‌ప్పుడు.. దీనిని ప్ర‌జ‌ల్లోకి ప్ర‌చారం రూపంలో తీసుకువెళ్లాలి.

త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ధిని పొందాల్సి ఉంటుంది. కానీ, ఆ దిశ‌గా ఎక్క‌డా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. దీనికి కార‌ణం ఏంటి? అంటే.. కొత్త జిల్లాల‌కు అధికారుల‌ను ఇవ్వాల్సిన బాధ్య‌త కేంద్రం పైనే ఉంటుంది. ఈ విష‌యంపై కేంద్రానికి సీఎం చంద్ర‌బాబు లేఖ కూడా రాశారు. అయిన‌ప్ప‌టికీ.. అక్కడి నుంచి స‌రైన స‌మాధానం రాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త జిల్లాల‌కు అధికారుల‌ను కేటాయిస్తూ.. కేంద్రం ప్ర‌క‌ట‌న జారీ చేయ‌లేదు.

దీంతో ప్ర‌స్తుతం ఈ రెండు జిల్లాల‌ను ఉమ్మ‌డి జిల్లాల‌కు క‌లెక్ట‌ర్లుగా ఉన్న వారే.. ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీని వ‌ల్ల అనుకున్న విధంగా ప్ర‌భుత్వానికి సానుకూల అయితే రావ‌డం లేదు. పైగా.. ఈ రెండు జిల్లాల‌తోపాటు.. ఇత‌ర కొన్ని జిల్లాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంది. అయితే.. పాల‌నాపర‌మైన ఇబ్బందుల నేప‌థ్యానికి తోడు.. కొన్ని వ‌ర్గాల వ్య‌తిరేక‌తతో ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌క్క‌న పెట్టారు.

దీంతో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల విష‌యాన్ని ప్ర‌భుత్వం త‌ట‌స్థంగా ఉంచేది. అయితే.. రాష్ట్ర స్థాయిలో గెజిట్ నోటిఫికేష‌న్ ఇచ్చినా.. కేంద్రం స్థాయిలో మాత్రం ప్ర‌క‌ట‌న ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. అందుకే.. రెండు కొత్త జిల్లాల‌పై అధికార ప్ర‌క‌ట‌న చేసినా.. దానిపై పెద్ద‌గా స్పందించ‌డం లేద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News