జపాన్ లో కాసులు కురిపిస్తున్న గోమూత్రం
దేశంలో గో ఆధారిత పదార్థాలపై తీవ్ర చర్చ సాగుతోంది. బీజేపీ నాయకులు గో ఆధారిత పదార్థాలతో వ్యాధులు దూరమవుతాయని, గోమూత్రం సేవించాలని సూచిస్తున్నారు. ఆ గోమూత్రంతో కరోనా వైరస్ కూడా రాదని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో గోవుతో భారత రాజకీయాలు ముడిపడిన విషయం తెలిసిందే. భారత్ లో ఏమోగానీ జపాన్ లో మాత్రం గోమూత్రం బంగారంగా మారింది. గోమూత్రంతో భారీగా సంపాదిస్తున్నారు. అక్కడ గోమూత్రంతో బీడుభూములు కూడా బంగారు పంటలుగా మారిపోతున్నాయి. దీంతో గోమూత్రం కు భారీ డిమాండ్ ఏర్పడింది. జపాన్ లో భూసారం క్షీణించి పంటల దిగుబడి తగ్గిపోతున్నది. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో వారికి అద్భుతమైన ఆలోచన కలిగింది. నార్తరన్ జపాన్ ఆధారిత సేంద్రియ ఉత్పత్తుల కంపెనీ Kankyo Daizen గోమూత్రం వినియోగించి పంట సాగు చేస్తే లాభాలు వస్తాయని విజయవంతంగా చేసి చూపెట్టింది.
గోమూత్రంతో తయారుచేసిన సేంద్రీయ ఎరువులు భూమి సారవంతమై పంటలు పండుతున్నాయి. దీంతో ఆ దేశ రైతులు భారీగా సంపాదిస్తున్నారు. గోమూత్రంతో పర్యావరణానికి అనుకూలమైన ఎరువులను తయారు చేసి పొలాలకు సేంద్రీయ ఎరువులుగా వినియోగిస్తున్నారు. జపాన్ లోని సౌత్ ఈస్ట్ ఏసియాలోని రైతుల వద్ద ఉన్న గోవుల నుంచి మూత్రాన్ని సేకరిస్తోంది. Tsuchi Ikikaeru అనే సేంద్రియ ఎరువు పేరుతో లిక్విడ్ రూపంలో వ్యవసాయం కోసం రైతులకు అందిస్తోంది. సారవంతం కోల్పోయిన భూముల్లో తిరిగి జీవాన్ని నింపేందుకు ఈ గోమూత్రం ఎరువు అద్భుతంగా పనిచేస్తుండడంతో పంటల ఉత్పత్తి భారీగా పెరిగి లాభాలు వస్తుండడంతో కంపెనీ చెబుతోంది. ఈ ఎరువు బాగా పని చేస్తుండడంతో జపాన్ తో పాటు మరో ఐదు దేశాల్లో ఈ ఎరువు విక్రయాలు జోరందుకున్నాయి. వియత్నాం, కంబోడియాలకు కూడా ఈ సేంద్రీయ ఎరువును ఆ కంపెనీ సరఫరా చేస్తోంది.
వ్యవసాయానికి అనుకూలమైన సౌత్ ఈస్ట్ ఏసియాలో భూసారం క్షీణత సమస్యలతో పాటు లాభదాయకంగా వ్యవసాయం లేదు. దీంతో రసాయన ఎరువులు కూడా సేంద్రియ ఎరువులపై ఆ కంపెనీ ప్రయోగాత్మకంగా రూపొందించింది. వ్యవసాయ రసాయనాలను దీర్ఘకాలంగా వాడటం వలన భూసారం తగ్గుతుందని గ్రహించి Kankyo Daizen సేంద్రియ ఎరువుల కంపెనీ జపాన్ లోని ఉత్తర ప్రాంతమైన హుక్కాయిడోలో రైతుల డెయిరీ నుంచి గోవుల మూత్రాన్ని కంపెనీ సేకరించి Tsuchi Ikikaeru అనే పేరుతో సేంద్రీయ ఎరువు ద్రవణాన్ని తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసింది. ఈ ప్రకృతిసిద్ధమైన సేంద్రీయ ఎరువు భూసారాన్ని పరిరక్షించడంతో పాటు పంటలకు జీవం పోస్తోంది. దీంతో ఆ ద్రావణాన్ని సాయిల్ కండీషనర్ గా పేర్కొంటున్నారు. దీంతో ఆ కంపెనీ హుక్కాయిడో లో 2002లో ప్లాంట్ స్థాపించి ఆ ద్రావణం ఉత్పత్తి పెంచింది. ఇప్పుడు ఆ కంపెనీ ఉత్పత్తి చేసే సేంద్రీయ ఎరువులు, డియోడరైజెస్ లకు విదేశీ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో ఆవులున్న రైతులకు కూడా ఆదాయం పెరిగింది. గోమూత్రం విక్రయించి లాభపడుతున్నారు.
ఈ ద్రావణం ఆధారం గా జనవరి వరకు 12 నెలల కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు 11 శాతం పెరిగి 2.13 మిలియన్ల డాలర్లు ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెట్టింది. విదేశీ ఎగుమతులతో ఈ కంపెనీ ఆదాయం మొత్తంగా 10 శాతానికి పెరిగింది. ఈ సేంద్రీయ ఎరువుల వినియోగం తో వరి, కూరగాయలు, పూల పంటలకు నాణ్యమైన దిగుబడి అందిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. భూసారం పెరుగుతుందని.. పంట వేసిన పొలాల్లో మరుసటి ఏడాది అదే పంట వేసినా దిగుబడి బాగా వస్తుందని కంపెనీ చెబుతోంది.